లీకులు వద్దంటున్న ఎవరు

0

నిన్న విడుదలైన ఎవరు మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మధ్యకాలంలో తెలుగులో ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ రాలేదు కాబట్టి వర్గాలతో సంబంధం లేకుండా అన్ని సెంటర్స్ లోనూ పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. వీకెండ్ ని బాగా వాడుకునే పనిలో పబ్లిసిటీ వేగాన్ని పెంచిన అడవి శేష్ టీమ్ కి సోషల్ మీడియా రూపంలో స్పాయిలర్స్ నుంచి పెద్ద ముప్పు ఎదురవుతోంది. అదే ట్విస్టులను రివీల్ చేసే బ్యాచ్.

చాలా కీలకమైన ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు క్లైమాక్స్ లో ఏం జరిగిందో కొందరు సెల్ ఫోన్ కెమెరాతో తీసిన ఫోటోలను పోస్టు చేస్తుండటం తలనొప్పిగా మారింది. ఇలాంటి సస్పెన్స్ సినిమాలకు కంటెంట్ లీక్ కాకుండా ఉండటం చాలా ముఖ్యం. అందులోనూ ఇది రీమేక్ మూవీ. ఇన్విజిబుల్ గెస్ట్ – బదలా అఫీషియల్ రీమేక్ కావడంతో వాటితో పోలికలు పెడుతూ ఎక్కడ మార్చారో కూడా ఫేస్ బుక్ ట్విట్టర్ లో చెప్పేయడం చూడని వాళ్ళ థ్రిల్ ని చంపేస్తోంది

అందుకే అడవి శేష్ ప్రత్యేకంగా రెజీనా- నవీన్ చంద్రలతో ఉన్న వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ ఇలాంటివి చేయకండని రిక్వెస్ట్ చేశాడు. గ్యాప్ వచ్చినా కూడా మంచి హిట్ దక్కిందన్న ఆనందం శేష్ లో కనిపిస్తోంది. రెజీనా కూడా చాలా కాలం తర్వాత పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రను దక్కించుకుని డిఫరెంట్ షేడ్స్ ని అద్భుతంగా పండించింది. వీకెండ్ అయ్యాక కూడా ఎవరు ఎలా రన్ అవుతుంది అనే దాన్ని బట్టి వసూళ్ల లెక్కలు తేలుతాయి. బడ్జెట్ మూవీ కాబట్టి ఎలా చూసుకున్నా నిర్మాత బయ్యర్లు అందరూ లాభాల్లోకి ఎంటర్ కావడం సులభంగానే కనిపిస్తోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home