లంగా ఓణిలో నిజంగా చందమామలా ఉన్నావ్

0

చందమామ చిత్రంతో కాజల్ అగర్వాల్ తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతుకు ముందు చేసిన సినిమాల కంటే చందమామతోనే కాజల్ కు ఎక్కువగా పేరు వచ్చింది. అందుకే కాజల్ ను చందమామ బ్యూటీగానే అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. అంతటి స్టార్ డం దక్కించుకున్న కాజల్ అగర్వాల్ దాదాపు పుష్కర కాలం పాటు టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ఇప్పటికి కూడా మంచి ఆఫర్స్ తో కెరీర్ లో సాగుతోంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య చిత్రంలో కమల్ హాసన్ తో ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. మరో అయిదేళ్ల వరకు ఈ అమ్మడి స్టార్ డం ఇలాగే ఉంటుందనిపిస్తుంది. తాజాగా హెయిర్ డ్రస్సర్ సీమ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫొటో వైరల్ అవుతోంది.

ఒక సినిమా షూటింగ్ సందర్బంగా కాజల్ మేకప్ అవుతోంది. నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్న కాజల్ లంగా ఓణిలో నిజంగానే చందమామ మాదిరిగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చందమామ అంతటి వెలుగు నీలో ఉంది కాజల్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.Please Read Disclaimer