ఎక్స్ క్లూజివ్ టీజర్: చై బర్త్ డే గ్లింప్స్

0

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని సినిమా(ఎన్.సి19) ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. చైతూ ఈ చిత్రంలో ఓ స్పోర్ట్స్ మేన్ గా కనిపించబోతున్నాడని ఇదివరకూ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ వెల్లడించింది. ఈ సినిమా శేఖర్ కమ్ముల మార్క్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.

నేడు(నవంబర్ 23) నాగచైతన్య బర్త్ డే సందర్భంగా 10.30కు స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నామని అమిగోస్ క్రియేషన్స్ బృందం ప్రకటించింది. తాజాగా ఆ టీజర్ తుపాకి డాట్ కాం ఎక్స్ క్లూజివ్ గా సేకరించింది. టీజర్ ఆద్యంతం అక్కినేని నాగచైతన్య ఎంతో స్పెషల్ గా కనిపిస్తున్నాడు. మునుపటితో పోలిస్తే షార్ట్ హెయిర్.. గుబురు గడ్డం.. ఫేస్ లో వైబ్రేంట్ గా కనిపిస్తున్న ఆ నవ్వు.. సంథింగ్ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారనే ఈ వీడియో చెబుతోంది. ఒక ఇల్లు .. ఆ ఇంటి పరిసరాలను చీపురుతో శుభ్రం చేస్తున్నాడు. చెమట పట్టేంతగా శ్రమిస్తున్న చైతూ ఏదో విజన్ తో ఉన్నట్టుగానే కనిపిస్తున్నాడు. అన్నట్టు చైతన్య చుట్టూ కొంతమంది చిన్నారులు సరదాగా గేమ్ ఆడుతూ కనిపిస్తున్నారు. అంటే ఆ చిన్నారులతో చై జీవితం ముడిపడి ఉందని అర్థమవుతోంది. ఇంతకీ అంతమంది చిన్నారు ఆ ఇంట్లో ఎందుకు ఉన్నారు? చైతూతో ఆ చిన్నారులకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది తెలియాల్సి ఉంది. మజిలీ తర్వాత మరో ప్రయోగాత్మక చిత్రంలో చైతన్య నటిస్తున్నారా.. అక్కినేని ఫ్యాన్స్ కి మరోసారి ఎమోషనల్ ట్రీట్ ఉంటుందా? అన్నది చూడాలి.
Please Read Disclaimer