ఎఫ్2 అందులో వెనుకబడింది

0

ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఒకే ఒక్క ఇండస్ట్రీ హిట్ గా సంచలనాలు నమోదు చేసిన ఎఫ్2 ఫైనల్ రన్ పూర్తి చేసుకుంది. ఒకటి రెండు చోట్ల హండ్రెడ్ డేస్ ఆడినట్టు చెబుతున్నా నిర్మాత దిల్ రాజు దాన్నెక్కడా హై లైట్ చేసుకోవడం లేదు. ఊహించిన దాని కన్నా లాభాలు ఎక్కువ ఇవ్వడంతో పాటు తన బ్యానర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలవడంతో ఆయన ఆనందం మాములుగా లేదు.

ఇటీవలే ఎఫ్2 స్టార్ మాలో వరల్డ్ ప్రీమియర్ గా ప్రసారం అయ్యింది. రేటింగ్స్ విషయంలో చాలా అంచనాలు పెట్టుకున్న ఛానల్ యాజమాన్యాన్ని కాస్త నిరాశ పరుస్తూ ఓవరాల్ గా 13.34 రేటింగ్ తో సర్దుకుంది. విడిగా అర్బన్ టిఆర్పి రేటింగ్ చూసుకుంటే 17.38 దాకా తెచ్చుకుని సూపర్ అనిపించుకుంది. అయినా ఇది గర్వంగా చెప్పుకునేది కాదు

ఎందుకంటే ఎఫ్2 గతంలో టీవీ రికార్డులు సృష్టించిన వాటి సరసన నిలవలేకపోయింది. ఈ విషయంలో గీత గోవిందం టాప్ లో ఉంది. ఏకంగా 20.7 రేటింగ్ తెచ్చుకుని విజయ్ దేవరకొండ స్టామినా చాటింది. రంగస్థలం దీని తరువాత స్థానంలో ఉంది. ఇవన్నీ నాన్ బాహుబలి మూవీస్ కింద లెక్క గట్టినవి. విడుదలైన మూడు నెలలకె ప్రసారమైన ఎఫ్2 వీటి దగ్గరకు చేరుకోలేకపోవడం వింతే.

ఇక్కడో కారణం ఉంది. ఎఫ్2 విడుదలైన 30 రోజులకే అమెజాన్ ప్రైమ్ ద్వారా హెచ్డి ప్రింట్ వచ్చేసింది. ఆ సైట్ తో పాటు వివిధ రూపాల్లో జనాల మధ్య చక్కర్లు కొట్టేసింది. టీవీలో వచ్చే లోపే వాటి ద్వారా కోట్లాది జనం చూసేశారు. అందుకే మళ్ళి యాడ్స్ వాయింపుతో ఎక్కడ చూస్తాం లెమ్మని లైట్ తీసుకున్నారు. దాని వల్లే రేటింగ్ తగ్గింది. మొత్తానికి ఎఫ్2 బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపినా బుల్లితెరపై మాత్రం ఆ దూకుడు చూపించలేకపోయింది
Please Read Disclaimer