మహేశ్ కు అచ్చొచ్చిన కొండారెడ్డి బురుజులో ఏముంటుందంటే?

0

సరిలేరి నీకెవ్వరు సినిమాలో కూడా ప్రిన్స్ మహేశ్ బాబు కొండారెడ్డి బురుజు సెంటర్లో ఫైట్లు చేసినట్టుగా స్పష్టం అవుతోంది. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన పలు లుక్స్ లో కొండారెడ్డి బురుజును చూపించారు. మహేశ్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ఒక్కడులో కూడా కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ కనిపిస్తుంది. ఆ సెట్ పై చిత్రీకరించిన ఫైట్ బాగా హైలెట్ అయ్యింది.

ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ మహేశ్ సినిమాలో కొండారెడ్డి బురుజు సెంటర్ కనిపిస్తూ ఉంది. ఈ సారి కూడా సెట్టింగ్ వేశారు. ఇలా మహేశ్ కు అచ్చొచ్చిన సెట్ అవుతూ ఉంది కొండారెడ్డి బురుజు. మరి ఇంతకీ కొండారెడ్డి బురుజు వెనుక అసలు కథ ఏమిటి దాన్ని ఎప్పుడు ఎవరు కట్టించారనేవి ఆసక్తిదాయకమైన విషయాలు ఈ కొండారెడ్డి ఎవరనేది కూడా మరో ఆసక్తిదాయకమైన అంశం.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందే తెలుగు సినిమాల్లో కొండారెడ్డి బురుజును కచ్చితంగా చూపిస్తూ ఉంటారు. కర్నూలు నడి సెంటర్లో ఉండే కొండారెడ్డి బురుజు పక్కగా హీరో ప్రయాణిస్తున్న సీన్లు వివిధ సినిమాల్లో కనిపిస్తాయి. ఆది సినిమాలో కూడా ఎన్టీఆర్ తన సుమోలో కొండారెడ్డి సెంటర్ మీదుగా వెళ్తాడు. ఇలా రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలకు కొండారెడ్డి బురుజు ఒక ఐకానిక్ ప్లేస్ అవుతూ వస్తోంది.

ఈ బురుజుకు ఎంతో చరిత్ర ఉంది. శతాబ్దాల కట్టడం అది. అయినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మరి అందుకు సంబంధించిన చరిత్ర ఏమి అందులో ఉన్న రహస్యాల గురించి ఈ వీడియోలో చూడవచ్చు.
Please Read Disclaimer