జెర్సీ: ట్రైన్ సీన్ వెనక అంత కథ ఉందట!

0

న్యాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెర్సీ’ పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక ట్రైన్ సీన్ ఉంది. జెర్సీ సినిమా పోస్టర్లలో నాని రైల్వే స్టేషన్ లో నిలబడి అరుస్తూ ఉన్న సీనే అది. సీన్ చిన్నదే అయినా అందిరినీ ఎంతగానో మెప్పించింది. ఈ సీన్ చిత్రీకరణ సమయంలో చాలానే ఇబ్బంది పడ్డారట ‘జెర్సీ’ టీమ్.

ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ ఈ సీన్ కోసం జనాలు పెద్దగా లేని మారుమూల ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్ ను ఎంచుకున్నామని చెప్పాడు. “ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో షూట్ చేయాలి. ఆ సమయంలో నాలుగు ట్రైన్లు వెళ్తాయి. ఆ నాలుగు ట్రైన్స్ వెళ్ళేలోపు షూట్ చెయ్యాలి. రెండో ట్రైన్ వెళ్ళే సమయంలో దానికి మరో గూడ్స్ ట్రైన్ అడ్డం వచ్చింది.” అన్నాడు. నాని అందుకుంటూ “అటువైపు నుంచి ట్రైన్ పాస్ అయ్యేసమయంలో మేము ఆ సీన్ ను చిత్రీకరించాలి. నేను రెడీ.. టీం అంతా రెడీ. నా కళ్ళు ఎర్రగా అయ్యి.. కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఎప్పుడెప్పుడు ట్రైన్ వస్తుందా సీన్ చేద్దామా అని రెడీగా ఉన్న సమయంలో మరోవైపు నుంచి ఒక భోగీ వచ్చి మాకు అడ్డంగా పార్క్ చేసిపెట్టాడు. ఈ భోగీ పెట్టిన సమయంలోనే మేము ఏ ట్రైన్ కోసమైతే ఎదురుచూస్తున్నామో ఆ ట్రైన్ ఆపి ఉన్న భోగికి వెనక నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత స్టేషన్ వారికి ఫోన్ చేస్తే ఆ భోగీని కాస్త వెనక్కు తీసుకెళ్ళి పెట్టారు. ఇక నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టాం” అన్నాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సీన్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ తనకు చాలామంది మెసేజులు పెట్టారని నాని వెల్లడించాడు.

డైరెక్టర్ మాట్లాడుతూ “మొత్తం సినిమా షూటింగ్ లో ఆ ట్రైన్ సీన్ ది బెస్ట్. నాకు.. యూనిట్ మెంబర్స్ కు ఇది బెస్ట్ ఎక్స్ పీరియెన్స్. అందరూ జోక్స్ వేసుకుంటూ ఫన్నీగా ఉన్నాం. బైట జనం చూడడానికి వస్తున్నారు.. వారిని మావాళ్ళు అపుతున్నారు. అంతా సందడిగా ఉంది. కానీ ఒకసారి ఆ ట్రైన్ రావడం.. నాని ఆ డైలాగ్ ను బిగ్గరగా పలకడం అయిన తర్వాత దాదాపు ఓ పదిహేను నిమిషాల పాటు అందరూ సైలెంట్ అయిపోయారు. అంత ఇంటెన్స్ గా ఉంది ఆ సీన్. డబ్బింగ్ లో కవర్ చేయడం.. రీ రికార్డింగ్ మ్యూజిక్ తో ఎలివేట్ చేయడం లాంటివి కాకుండా మేము అక్కడ లొకేషన్ లో చూసినప్పుడు మాకే ఆ ఇంటెన్సిటీ తెలిసింది” అన్నాడు .
Please Read Disclaimer