చిరంజీవి ప్రభాస్ లపై పక్కా ఫేక్

0

2019 ముగింపులో ఓ మూడు ఫేక్ మ్యాటర్స్ అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ అవేమిటి? అంటే.. ఒకటి రాజధానులకు వ్యతిరేకంగా మెగాస్టార్ చిరంజీవి స్పందన!! అంటూ సాగించిన ప్రచారం ఒకటి కాగా.. ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ ఖాయమైందంటూ సాగించిన ప్రచారం రెండోది.

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల్ని ప్రకటించగానే దానిని సమర్ధిస్తూ మెగాస్టార్ ఓ లేఖను లెటర్ హెడ్ పై రాసి మరీ పంపించారు. కానీ ఆ మరుసటిరోజే వేరొక ఫేక్ లెటర్ వైరల్ గా చర్చకొచ్చింది. మూడు రాజధానులను సమర్థిస్తూ కానీ లేదా అనుకూలంగా కానీ నేను మాట్లాడలేదు! అంటూ ఒక ఫేక్ లెటర్ ని వైరల్ చేశారు. అయితే అది ఫేక్ అన్న సంగతిని వివరిస్తూ చిరు స్వయంగా ఓ వాయిస్ ని మీడియాకి పంపడంతో క్లారిటీ వచ్చింది. మూడు రాజధానుల ప్రపోజల్ కి చిరు అనుకూలమేనని దాంతో తేలింది.

ఆ టాపిక్ అయిపోయింది అనుకుంటుండగానే… డార్లింగ్ ప్రభాస్ తో అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం హీటెక్కించింది. ఇది నిజమా? అంటే.. ప్రభాస్ సన్నిహితులు అదంతా ఫేక్ అని కొట్టి పారేశారు. ప్రస్తుతం ప్రభాస్ దృష్టి కేవలం జాన్ చిత్రంపైనే. ఆ తర్వాతనే ఏదైనా ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారని స్పష్టం చేశారు. ప్రభాస్ పెళ్లి ఫలానా అమ్మాయితో కుదిరిందంట! అంటూ సాగిన ప్రచారాలు అంతా ఫేక్ అని తేలింది. ఇప్పటివరకూ ప్రభాస్ కి పెళ్లి కుదరలేదు. క్షత్రియులకు పిల్ల దొరకడం కష్టమేనని.. పైగా ప్రభాస్ రేంజుకు తగ్గ వధువు దొరకడం మరీ కష్టంగా ఉందని ప్రచారమవుతోంది. అలాగే నా పెళ్లి సీక్రెట్ గా జరిగిందని సాగిన ప్రచారం ఫేక్ అంటూ మిర్చి బ్యూటీ రిచా గంగోపాధ్యాయ్ ప్రకటించడం ఆసక్తికరం.
Please Read Disclaimer