రష్మిక రూ. 200 కోట్లు ఉత్తమాటలే

0

హీరోయిన్ రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్ గా దూసుకు పోతుంది. ఈ ఏడాది అప్పుడే సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు సినిమాలు కూడా హిట్ అవ్వడంతో ఈమె ఈ ఏడాది కనీసం అరడజను సినిమాలకైనా కమిట్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈమె చేస్తున్న సినిమాలు కాకుండా ఈమెను ఇంకా పలువురు ఫిల్మ్ మేకర్స్ సంప్రదిస్తున్నారు.

ఈ సమయం లోనే ఈమె గురించి కన్నడం లో ఒక ఆసక్తికర వార్త ఒకటి ప్రచారం జరుగుతోంది. కన్నడ మీడియాలో రష్మిక ఇంటిపై జరిగిన ఐటీ రైడ్స్ లో భారీ ఎత్తున ఆస్తులు మరియు నగదు బయట పడ్డట్లుగా వార్తలు రాస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రష్మిక ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలను సంపాదించిందని ఐటీ అధికారులు గుర్తించినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాటిలో కనీసం 20 శాతంకు కూడా ఆమె ట్యాక్స్ కట్టలేదంటున్నారు.

రష్మిక ఇండస్ట్రీకి వచ్చి మూడు ఏళ్లకు కాస్త అటు ఇటుగానే అయ్యింది. అప్పుడే ఆమె ఇంత డబ్బు ఎలా సంపాదిస్తుందని అంతా నోరు వెళ్లబెడుతున్నారు. కెరీర్ ఆరంభంలో ఈమె కన్నడ సినిమాల్లో నటించింది. అక్కడ హీరోయిన్ గా ఈమె తీసుకున్నది పాతిక లక్షలు అంతకు తక్కువే. తెలుగులోకి వచ్చిన కొత్తలో కూడా పాతిక లక్షలకు అటు ఇటుగానే తీసుకుంది.

కోటి పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి ఇప్పుడే చేరుకుంది. మరి ఇంతలో అప్పుడే అంత డబ్బు ఎలా సంపాదించిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. కన్నడ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని.. రష్మిక గురించి వారు అవాస్తవాలు రాస్తున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండు వందల కోట్ల గురించి రష్మిక స్పందన ఏంటీ మాత్రం ఇంకా తెలియరాలేదు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-