రోడ్డు యాక్సిడెంట్ లో ప్రముఖ సింగర్ గీతా మృతి

0

ఇటీవల అంతకంతకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. తాజాగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక ప్రముఖ సింగర్ మృత్యువాత బడ్డారు. మరాఠీ ప్లేబ్యాక్ సింగర్ గీతామాలీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ముంబయి- ఆగ్రా హైవేపైన ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు.

పలు మరాఠీ చిత్రాలతో పాటు.. హిందీ చిత్రాల్లోనూ ఆమె పాటలు పాడారు. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన ఆమె.. తమ సొంతూరైన నాసిక్ కు కారులో వెళుతున్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్ ను కారు ఢీ కొట్టటంతో ఆమె మరణించారు. ఈ కారులో ఆమెతో పాటు ఆమె భర్త కూడా ఉన్నారు.

తీవ్ర గాయాల బారిన పడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్సను అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గీతా మాలీని ఆసుపత్రిలో చేర్చగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆమె మరణం పట్ల పలువురు దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు.
Please Read Disclaimer