సగంతో అల్లాడించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ లుక్ ఈమద్యే రిలీజైంది.. రెస్పాన్స్ అదిరిపోయింది. మహేష్ లుక్ మారడం లేదు.. రొటీన్ గా ఉంటోంది అనేవారు కూడా ఒక్కసారి సర్ప్రైజ్ అయ్యారు. అయితే ఈ ఫస్ట్ లుక్ లో మహేష్ సగం ఫేస్ మాత్రమే కనిపిస్తోంది.. త్వరలోనే ‘సర్కారు వారి పాట’ టీమ్ ఫుల్ లుక్ ను రిలీజ్ చేస్తారని సమాచారం.

అయితే ఫ్యాన్స్ మాత్రం అంతకంటే ముందే మిగతా సగం లుక్ ను తమ క్రియేటివిటీతో పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఆలా రెడీ చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ పోస్టర్ ను చూస్తుంటే రియల్ పోస్టర్ ఇదేనేమోనని ఎవరికైనా అనిపించడం ఖాయం. బ్లాక్ టీ షర్టు.. చెవికి రింగు ధరించి.. మెడపై రూపాయ పచ్చబొట్టు.. కాస్త రఫ్ గా ఉండే హెయిర్ స్టైల్ తో మహేష్ కొత్త గెటప్ లో ఇరగదీస్తున్నాడు.

ఏదేమైనా ఒకటి మాత్రం నిజం. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోను పరశురామ్ ఎలా ప్రెజెంట్ చేస్తాడు.. మాస్ సినిమాను తెరకెక్కించగలడా లాంటి అనుమానాలను పరశురామ్ ఒక్కసారిగా పటాపంచలు చేసి సినిమాపై అంచనాలను అమాంతం పెంచాడు.
Please Read Disclaimer