5 వేల కేజీల అభిమానం.. ఇది యశ్ క్రేజ్

0

కన్నడ లేటెస్ట్ సూపర్ స్టార్ యశ్ ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా యమ క్రేజ్ ను కలిగి ఉన్నాడు. ఈయన చేసిన కేజీఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా ఆల్ ఇండియా సూపర్ స్టార్ క్రేజ్ ను దక్కించుకున్నాడు. ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రంలో నటిస్తున్న యశ్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. సాదారణం గా అభిమాన హీరోల పుట్టిన రోజు సందర్బంగా ఫ్యాన్స్ కేక్స్ కట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ కేక్ లు కేజీ రెండు కేజీలు అయిదు కేజీలు మహా అయితే వంద కేజీల వరకు ఉండవచ్చు. కాని యశ్ అభిమానులు కట్ చేయబోతున్న కేక్ రికార్డునే సృష్టించబోతుంది.

100 కేజీలు కాదు వెయ్యి కేజీలు కాదు ఏకంగా 5 వేల కేజీల కేక్ ను యశ్ అభిమానులు కట్ చేసేందుకు సిద్దం చేశారు. ఇప్పటి వరకు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఏ హీరో అభిమానులు కూడా ఈ స్థాయిలో సెలబ్రేట్ చేసింది లేదు. బెంగళూరులోని ప్రముఖ ఆడిటోరియం లో ఇప్పటికే ఈ కేక్ ను ఏర్పాటు చేయడం జరిగింది. భారీ ఎత్తున అభిమానులు మరియు సినీ ప్రముఖులు హాజరు కాబోతున్న వేడుకలో ఈ కేక్ ను కట్ చేసి యశ్ బర్త్ డే వేడుక జరుపబోతున్నారు.

కేవలం బెంగళూరు.. కర్ణాటకలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా యశ్ బర్త్ డే వేడుకలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ ఎత్తున యశ్ పుట్టిన రోజు వేడుకల్లో అభిమానులు పాల్గొంటున్నారు. ఇక సోషల్ మీడియాలో బెంగళూరు.. హైదరాబాద్.. ఇండియా ఇలా అన్ని కేటగిరిల్లో కూడా టాప్ ట్రెండ్డింగ్ లో యశ్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.
Please Read Disclaimer