రూమ్ లోకి దూరి మౌనీ రాయ్ కు ఫ్యాన్ ప్రపోజ్

0

కొన్ని సార్లు సెలబ్రెటీలు తమ అభిమానుల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. బయటకు వెళ్లాలంటే భయం. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే అప్పుడు మాస్క్ వేసుకోవడం లేదంటే మొహం కనిపించకుండా కవర్ చేయడం చేస్తారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని సార్లు ఏదో ఒక అపశృతి జరుగుతూనే ఉంటుంది. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్ కి షాకింగ్ సంఘటన ఎదురైంది. ఆమెకు ఒక అభిమాని వచ్చి ప్రపోజ్ చేయడంతో పాటు తన పక్కన ఉన్న హీరో రాజ్ కుమార్ ను ఆమె ఫ్యాన్ కొట్టడంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమెకు నిమిషాల్లో చెమటలు పట్టి టెన్షన్ తో ఉక్కిరి బిక్కిరి అయ్యింది.

బుల్లి తెరపై స్టార్ ఇమేజ్ ను దక్కించుకున్న మౌనీ రాయ్ ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించేందుకు ప్రయత్నిస్తుంది. మేడ్ ఇన్ చైనా సినిమాతో మౌనీ రాయ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక టీవీ స్టూడియోకు ఇంటర్వ్యూ నిమిత్తం వెళ్లింది. ఆ ఇంటర్వ్యూ కాసేపట్లో ప్రారంభం అవ్వబోతుంది అనగా మౌనీ రాయ్ మరియు రాజ్ కుమార్ లు ఉన్న రూంలోకి ఒక వ్యక్తి దూసుకు వచ్చాడు.

చేతిలో బొకే ఉన్న ఆ వ్యక్తి మౌనీ రాయ్ కి ప్రపోజ్ చేశాడు. దయచేసి ప్రేమించడం.. మీరంటే నాకు చాలా ఇష్టం అంటూ వేడుకున్నాడు. ఆమె మొదట నవ్వినా ఆ తర్వాత అతడి మాటలకు సీరియస్ అయ్యింది. బయట సెక్యూరిటీ వారిని పిలుస్తూ ఉంది. మౌనీ రాయ్ ఇబ్బంది పడుతుండటంతో పక్కనే ఉన్న రాజ్ కుమార్ అతడిని బయటకు పంపించేందుకు ప్రయత్నించాడు. అప్పుడు రాజ్ కుమార్ ను అతడు బలంగా పక్కకు నెట్టేశాడు. దాంతో రాజ్ కుమార్ పక్కన ఉన్న సోఫాలో పడిపోయాడు.

దాంతో మౌనీ రాయ్ టెన్షన్ మరింత పెరిగింది. అప్పుడే ఆ వచ్చిన వ్యక్తి రాజ్ కుమార్ ను హగ్ చేసుకుని ఇది ఫ్రాంక్ అన్నాడు. బాబోయ్ ఇలాంటి ఫ్రాంక్ ఏంటీ నాకు చాలా భయం వేసింది. మళ్లీ ఇలాంటివి చేయవద్దు అంటూ ఇద్దరిని హెచ్చరించింది. ఈ ఫ్రాంక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మౌనీ రాయ్ పడ్డ టెన్షన్ ను చూసి అంతా నవ్వుకుంటున్నారు.
Please Read Disclaimer