స్టార్ హీరోయిన్ ని చెప్పుతో కొట్టి మాయమయ్యాడు!

0

ఒక్కోసారి అభిమానుల కోపం హద్దు మీరితే ఏం జరుగుతుందో కూడా తెలీదు. మాస్ ఫ్యాన్స్ విపరీతమైన రచ్చ చేస్తుంటారు. తమ అభిమాన కథానాయకుడు లేదా కథానాయిక తమ అంచనాలకు తగ్గట్టు రాణించకపోతే మాత్రం సీరియస్ గానే ఉంటుంది వ్యవహారం. సరిగ్గా ఇదే కోణంలో ఇదివరకూ ఓ వీరాభిమాని ఏకంగా స్టార్ హీరోయిన్ పైనే చెప్పు విసిరాడు.

హైదరాబాద్ నగరంలో ఓ బంగారం దుకాణం ప్రారంభోత్సవానికి విచ్చేసిన సదరు స్టార్ హీరోయిన్ పైకి అతడు చెప్పు విసరడంతో రసాభాస అయ్యింది. అయితే అది తనకు తగలకుండా పక్కనే పడడంతో ఆ కథానాయిక ఊపిరి పీల్చుకుంది. ఆ ఘటనపై విచారించిన పోలీసులు ఆ తర్వాత ఆ కుర్రాడిని పట్టుకుని నాలుగు తన్నారు.

పోలీసులే రంగంలోకి దిగడంతో అతడు చెప్పిన షాకింగ్ రీజన్ ఆశ్చర్యపరిచింది. సరిగా సినిమాలపై దృష్టి సారించకుండా ఇలా షాపుల ఓపెనింగులు అంటూ టైమ్ వేస్ట్ చేస్తోంది నా ఫేవరెట్ స్టార్! అంటూ అతడు ఆవేదన చెందాడట. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేస్తాడు? అంటే కాలేజ్ చదువు పూర్తి చేసి ఉద్యోగం వెతుక్కునే పనిలో ఉన్నాడట. వీరాభిమానం పీక్స్ కి చేరుకుంటే ఇలానే ఉంటుంది మరి. ముందు తన తాహతు స్థాయి చూసుకుని ఎదుటివాళ్ల గురించి ఆలోచించాలంటారు. అలా కాకుండా ఆ అభిమాని ఎదుటివారి తాహతు గురించి బాగు గురించి ఆలోచించి ఇలా పట్టుబడిపోయాడు. ఫ్యానిజం పిచ్చి కొంత తగ్గించుకుంటే మంచిదని ఈ ఘటన చెబుతోంది.
Please Read Disclaimer