మహేష్ ఇలాంటి సినిమాలు చేస్తే ?

0

ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా సాహో గురించిన చర్చే జరుగుతోంది. 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిన విజువల్ వండర్ ని చూసేందుకు అభిమానుల కన్నా ఎక్కువగా సగటు సినిమా ప్రేమికులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీని సందడి తగ్గగానే మెగాస్టార్ సైరా హంగామా ఉంటుంది. రెండింటి మధ్య గ్యాప్ కేవలం 32 రోజులే కావడంతో వీటికి సంబంధించిన వార్తలు విశేషాలు మీడియాలో హోరెత్తనున్నాయి.

ఇప్పుడివి జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారిన క్రేజీ ప్రాజెక్ట్స్. ఒకవేళ ఆశించినట్టే ఇండస్ట్రీ హిట్స్ అయితే మాత్రం తెలుగు సినిమా గొప్పదనం గురించి బాహుబలి తర్వాత మరోసారి ప్రపంచానికి చాటినట్టు అవుతుంది. ప్రభాస్ టాపిక్ అఫ్ ది నేషన్ గా మారితే చిరంజీవి లేట్ ఏజ్ లోనూ తన ఐకాన్ ఇమేజ్ ని నిలబెట్టుకున్న వారవుతారు.

ఇదంతా ఓకే కానీ ప్రిన్స్ మహేష్ బాబుకి వీటికి కనెక్షన్ ఏంటా అనే కదా మీ సందేహం. ఆయన అభిమానులు తమ హీరో కూడా ఇలాంటి సినిమాలు చేస్తే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఒకప్పుడు టక్కరి దొంగ-ఒక్కడు లాంటి ఎక్స్ పరిమెంట్స్ చేసిన మహేష్ బ్రహ్మోత్సవం తరువాత ఒకలాంటి టెంప్లేట్ కు అలవాటు పడి రిస్కీ సబ్జెక్ట్స్ ఎంచుకోవడం లేదు.

సాహో లాంటి భారీ యాక్షన్ ఎంటర్ టైనరో లేదా సైరా లాంటి హిస్టారికల్ మూవీనో మహేష్ చేస్తే ఇక ఆ రికార్డుల గురించి ఊహించుకోవడం మాటలకందేది కాదు. మహర్షి లాంటి రెగ్యులర్ కాన్సెప్ట్స్ తోనే వంద కోట్లు ఈజీగా రాబడుతున్న ప్రిన్స్ ఇలాంటి గ్రాండియర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆకాంక్ష. ఆ రోజు ఎంత త్వరగా వస్తుందో అని ఎదురు చూడటం తప్ప మనం మాత్రం చేయగలిగింది ఏముంది.
Please Read Disclaimer