దివంగత నటి మృతి పై నెట్టింట రచ్చ చేస్తున్న ఫ్యాన్స్.. ఎందుకని??

0

బాలీవుడ్ దివంగత యువ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ సూసైడ్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సుశాంత్ కేసు అటు ఇటు తిరిగి ఆఖరికి అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమని కేసు పెట్టారు సుశాంత్ తండ్రి. ఈ కేసు విచారణలో బిహార్ పోలీసులకు ముంబై పోలీసులు పరస్పరం సహకరించుకొని ఈ కేసు విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని కోరుతూ బీహార్ ప్రభుత్వం అపీల్ చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సుశాంత్ కేసు పై సానుకూలంగా స్పందించి సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చింది. దీంతో సుశాంత్ ఆత్మహత్యపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సీబీఐ విచారణ మొదలు పెట్టింది.

ఇదిలా ఉండగా.. రెండున్నరేళ్ల క్రితం అంటే 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లో ప్రాణాలు వదిలిన అతిలోక సుందరి శ్రీదేవి కేసులో కూడా సీబీఐ విచారణ జరపాలని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ఉద్యమం ప్రారంభించారు. దుబాయ్ లో ఓ పెళ్లి వేడుకకు హాజరైన శ్రీదేవి.. హోటల్ గది బాత్ టబ్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే శ్రీదేవి బీపీ కారణంగా భర్త కారణంగా చనిపోయిందని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అప్పట్లోనే ఈ విషయం వదిలేసారు. అయితే శ్రీదేవి మృతి వెనుక ఏదో బలమైన కారణం ఉందని.. బాత్ టబ్ లో పడి చనిపోవడం ఏంటని..? “సిబిఐఎంక్వయిరీఫర్ శ్రీదేవి” అనే హ్యాష్ ట్యాగ్ తో రచ్చ చేస్తున్నారు. ఆగస్టు 13న శ్రీదేవి పుట్టినరోజు కావడంతో శ్రీదేవి కేసు మళ్లీ రైస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బతికున్న స్టార్ హీరోల పుట్టినరోజు హంగామా ఏమో గాని ఇప్పుడు చనిపోయిన సెలబ్రిటీల గురించి హంగామా చేయడం ఏంటో అంటూ పలువురు అభిప్రాయ పడుతున్నారు.