వీక్ ప్రమోషన్స్.. అప్సెట్ అవుతున్న ఫ్యాన్స్!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి సీజన్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ తో పోటీపడనుంది. రెండు సినిమాలు ఒకేరోజున విడుదల కానుండడంతో ఏ సినిమా విజేతగా నిలుస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు ‘అల’ టీమ్ ప్రమోషన్స్ విషయంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే రెండు సింగిల్స్ రిలీజ్ చేస్తే అవి చార్ట్ బస్టర్స్ గా నిలిచి సినిమాపై క్రేజ్ ను అమాంత పెంచాయి. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ మాత్రం ఇంకా టైం ఉంది కదా అనే ధోరణిలో ఉంది.

ఫస్ట్ లుక్ పోస్టర్లు.. పండగ టీజర్లు.. టైటిల్ సాంగ్ బిట్ లాంటివి ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ ఇప్పటివరకూ రిలీజ్ చేసింది కానీ ప్రమోషన్స్ విషయంలో ‘అల..’ టీం తో పోటీపడలేక పోతోంది. థమన్ చూస్తే భీకరమైన ఫామ్ లో ఉన్నాడు అన్నట్టుగా బన్నీకి సూపర్ ట్యూన్స్ ఇస్తున్నాడు. ఇటువైపు దేవీ ఫాం లో లేడు.. దేవీ టాలెంట్ విషయం ఎవరూ శంకించలేరు కానీ ఈమధ్య సరైన చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇవ్వలేకపోతున్నాడు. మహేష్ లాస్ట్ సినిమా విషయంలో కూడా దేవీ పట్ల మహేష్ అభిమానుల్లో కొంత నెగెటివిటీ కనిపించింది. ఇప్పుడు సరిలేరు విషయంలో ఏం చేస్తాడో అని వారు ఆందోళనలో ఉన్నారు. ఇదిలా ఉంటే ‘సరిలేరు’ సినిమా నుండి ఒక మాస్ సాంగ్ ను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తామని తాజాగా ప్రకటించారు.

ఈ విషయం అభిమానులను అసంతృప్తికి గురిచేస్తోంది. సినిమాలో మంచి కంటెంట్ ఉందని ‘సరిలేరు టీమ్’ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తోంద కానీ ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఇప్పుడే ఎందుకు అన్నట్టుగా లేట్ చేస్తున్నారు. ఒకవేళ లేట్ గా సాంగ్స్ రిలీజ్ చేసినా అవి చార్ట్ బస్టర్ సాంగ్స్ అయితే పరవాలేదు కానీ యావరేజ్ అయితే మాత్రం దేవీపై మరింతగా ఒత్తిడి పెరగడం ఖాయం. ఏదేమైనా దర్శకుడు అనిల్ ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home