సరదాగా చాట్ చేస్తే.. వర్జినా అని అమ్మడిని అడిగేశారు

0

మీడియాతో మాట్లాడేటప్పుడు ఉండే అడ్వాంటేజ్.. సోషల్ మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు ఉండదన్న విషయం తారలకు ఇప్పుడిప్పుడే అర్థమైపోతుంది. సోషల్ మీడియాతో ఇమేజ్ బిల్డ్ చేసుకోవటానికి మించిన రిస్క్ మరొకటి లేదంటున్నారు. మీడియాతో ఉండే మర్యాద.. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మాత్రం అస్సలు అంచనా వేయలేమని.. ఎవరు? ఎక్కడ నుంచి.. ఏ రీతిలో క్వశ్చన్ చేస్తారో? అన్నది ఊహించలేని అంశం.
నటుల విషయంలో ఇబ్బందికర ప్రశ్నలు ఎదుర్కొనేది తక్కువ. కానీ.. నటీమణుల విషయంలో ఇబ్బందులు తప్పట్లేదు. ఇటీవల కాలంలో ఈ ధోరణి అంతకంతకూ పెరిగిపోతోంది. సరదాగా కాసేపు సోషల్ మీడియాలో మాట్లాడాదమని వస్తున్న నటీమణులు.. కొందరి నుంచి వస్తున్న వ్యాఖ్యలు.. ప్రశ్నలకు విపరీతంగా హర్ట్ అవుతున్నారు. సమాధానం చెప్పలేక కిందామీదా పడుతున్నారు.

తాజాగా ఇప్పుడు అలాంటి చేదు అనుభవమే నివేదా థామస్ కు ఎదురైంది. తక్కువ వ్యవధిలోనే నటిగా గుర్తింపు పొందిన నివేదా.. తాజాగా రజనీ దర్బార్ మూవీలో చేస్తున్న సంగతి తెలిసిందే. సరదాగా ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో ఇంట్రాక్ట్ కావాలని ఆశ పడిన ఆమెకు.. కాస్తంత ఫన్ లభించినా.. అదే సమయంలో ఫస్ట్రేషన్ తప్పలేదు.

సరదా ప్రశ్నలు వేసి సంతోష పెట్టిన ఫ్యాన్స్ కొందరైతే.. మరికొందరు మాత్రం అసభ్యకరమైన ప్రశ్నలు వేయటంతో నివేదా తెగ ఇబ్బంది పడ్డారట. అదే విషయాన్ని ఆమె ప్రస్తావించారు కూడా. సరదాగా మాట్లాడమంటే.. మీ పెళ్లి ఎప్పుడు? మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరా? మీరు వర్జినా? కాదా? లాంటి దరిద్రపు ప్రశ్నలు పలువురు అడిగారని ఫీలయ్యారు. అందకుండా ఊరించే తార.. తమ చెంతకు వచ్చినప్పుడు అపురూపంగా చూసేవారే కాదు.. అసహ్యంగా వ్యవహరించేవారు కూడా ఉంటారన్న చిన్న వాస్తవిక ధోరణి ముద్దుగుమ్మలు ఎందుకు మిస్ అవుతున్నట్లు?
Please Read Disclaimer