అనుకున్న దానికి మించి ఫ్యాన్స్

0

కన్నడ కస్తూరి మెగాస్టార్ చిరంజీవిని భలే కాకా పట్టేసిందిగా. సూపర్ స్టార్ మహేష్ నటించిన తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు` ప్రీరిలీజ్ కార్యక్రమం ఆదివారం ఎల్బీ స్టేడియంలో భారీ స్థాయిలో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి చిఫ్ గెస్ట్ గా విచ్చేయడంతో దిల్ రాజు భారీ హంగామా చేశారు. చిరు తొలిసారి మహేష్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ భారీగానే తరలి వచ్చారు. అనుకున్న దానికి మించి ఫ్యాన్స్ రావడంతో ఎల్బీ స్టేడియం కిక్కిరిసిపోయింది.

తెలుగు సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని వేడుక అంటూ మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వచ్చి ఈ వేడుక దాదాపు అదే స్థాయిలో జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కన్నడ కస్తూరి రష్మిక మందన్న ఈ ప్రీరిలీజ్ వేడుకని బాగానే వాడుకుంది. హీ ఈజ్ సో క్యూట్ పాటలో మహేష్ ని డామినేట్ చేసినట్టుగానే స్టేజ్ పైకి వచ్చిన దగ్గరి నుంచి మైక్ తీసుకుని మహేష్ ఫ్యాన్స్ ని ఓ రేంజ్లో హుషారెత్తించిన రష్మిక మెయిన్ గా మెగాస్టార్ చిరంజీవిని ప్రసన్నం చేసుకోవడానికే అత్యధికంగా ప్రయత్నించింది.

తను టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన `ఛలో` ఫంక్షన్ కి ఆ తరువాత చేసిన `గీత గోవిందం` ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరు వచ్చారని అదే తరహాలో ఈ సినిమా ఫంక్షన్ కి వచ్చారని ఆ రెండు చిత్రాలు భారీ స్థాయిలో విజయాన్ని సాధించాయి. ఇది కూడా దానికి మించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఈ విషయంలో చిరు తన లక్కీ ఛార్మ్ అయిపోయాలని తెగ పొగిడేసింది. రష్మిక మాటలకు చిరుతో పాటు అక్కడున్న వారంతా ఫిదా అయిపోయారు. అంతా మెస్మ రైజ్ చేసిందీ రౌడీ గాళ్.
Please Read Disclaimer