స్వీటీ ఇలానే ఉండాలట.. పట్టుబడుతున్న ఫ్యాన్సు!

0

సౌత్ అంతా పాపులర్ అయిన హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. ‘బాహుబలి’ భారీ విజయం తో అనుష్కకు దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు దక్కింది. టాలీవుడ్ లో లేడీ ఒరియంటెడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా కూడా స్వీటీ సొంతం. అయితే ‘బాహుబలి తర్వాత అనుష్క చేసే సినిమాల సంఖ్య చాలా తగ్గిపోయింది.

అదొక్కటే కాదు.. ‘సైజ్ జీరో’ కోసం వెయిట్ పెరగడం స్వీటీ గ్లామరస్ కు ఎసరుపెట్టింది. అప్పటి నుంచి మునుపటి లాగా స్లిమ్ముగా మారాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్వీటీ మాత్రం అలా మారలేకపోతోంది. దీంతో స్వీటీతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు గ్రాఫిక్స్ ను గట్టిగా నమ్ముకుంటున్నారని.. స్వీటీ అసలు రెమ్యూనరేషన్ కు తోడు ఇది కొసరు రెమ్యూనరేషన్ గా మారిందనే టాక్ కూడా ఉంది. ఇదిలా ఉంటే స్వీటీ ఫ్యాన్స్ మునుపటి హాట్ ఫోటోలను చూసుకుంటూ మురిసిపోతూనే ఉన్నారు. అనుష్క మళ్ళీ అలా మారాలని సోషల్ మీడియాలో కూడా అక్కడక్కడా డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

పైనున్న ఫోటోలో అనుష్క ఒక స్కిన్ టైట్ స్లీవ్ లెస్ టాప్ ధరించి కొత్తతరం హాటు భామలకు వెయ్యి రెట్లు అన్న రీతిలో సూపర్ హాట్ పోజిచ్చింది. ఇక ఆ నడుము దగ్గర ఉన్న కట్ అయితే బ్లాక్ బస్టర్ అనుకోవాలి. ఆ గ్యాప్ ను అలాంటి కట్ తో ఎలివేట్ చేసిన తీరుకు జేజేలు పలకాల్సిందే. ఆ హెయిర్ స్టైల్.. బ్లాక్ కూలింగ్ గ్లాసెస్.. పింక్ లిప్ స్టిక్ అన్నీ సరిగ్గా మ్యాచ్ అయ్యాయి. ఇలాంటి ఫోటోలు చూసిన ఫ్యాన్స్ అలాంటి గ్లామరే కావాలని ప్రత్యేక గ్లామర్ కోసం డిమాండ్లు వినిపించడంలో తప్పులేదు. మరి స్వీటీ హైకమాండ్ అలాంటి ప్రత్యేక గ్లామర్ హోదాలను ఇస్తుందో లేదో!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-