కమల్ కంటిన్యూ.. ఫ్యాన్స్ హ్యాపీ

0

తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టిన యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. గత కొన్నాళ్లుగా కమల్ చివరి చిత్రం ఇండియన్ 2 అంటూ ప్రచారం జరుగుతోంది. రాజకీయాలు మరియు సినిమాలు చేసేందుకు నేనేం గొప్ప వ్యక్తిని కాదని ఏదో ఒకటి వదిలేయాల్సిన పరిస్థితి రావచ్చు అంటూ ఆమద్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దాంతో రాజకీయాల కోసం సినిమాలను కమల్ వదిలేస్తాడని అంతా అనుకుంటున్నారు.

త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. కనుక ఆ ఎన్నికల వరకు ఇండియన్ 2 పూర్తి చేసి ఆ తర్వాత సినిమాలకు శాస్వతంగా గుడ్ బై చెప్తాడేమో అంటూ తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. కమల్ సినిమాలను వదిలి పెట్టబోతున్నట్లుగా వస్తున్న వార్తలతో ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నారు. కేవలం తమిళనాడులోనే కాకుండా కమల్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కమల్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటారు. వారంతా కూడా కమల్ సినిమాలు వదిలేస్తాడంటే ఆవేదన వ్యక్తం చేశారు.

కాని గత రెండు మూడు రోజులుగా తమిళ మీడియాలో వస్తున్న వార్తలతో అభిమానులు అంతా కూడా సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఇండియన్ 2 చిత్రం తర్వాత కమల్ సినిమాలు కంటిన్యూ అవుతాయని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఖైదీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో ఒక సినిమాను చేసేందుకు కమల్ ఆసక్తిగా ఉన్నాడని చెన్నై సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుందట.

విభిన్న కాన్సెప్ట్ లతో సినిమాలు తీస్తున్న లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ విజయ్ తో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కాబోతుంది. ఇంకా పలువురు స్టార్ హీరోలు మరియు పెద్ద నిర్మాతలు కూడా లోకేష్ తో సినిమా కోసం క్యూ కట్టారు. ఆ క్యూలో కమల్ కూడా ఉన్నాడని సొంత బ్యానర్ లో లోకేష్ తో ఒక సినిమాను నిర్మించేందుకు కమల్ చాలా ఆసక్తిగా ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. లోకేష్ తో ఇప్పటికే కమల్ మాట్లాడినట్లుగా తమిళ మీడియా కథనాలు రాస్తోంది. ఆ కారణంగా కమల్ అభిమానులు ఇంకా తన సినీ కెరీర్ ను కంటిన్యూ చేస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు.

రాజకీయాల్లో కొనసాగుతూ సినిమాలు చేయాలని కమల్ అభిమానులు కోరుకుంటున్నారు. వారి కోరిక మేరకు కమల్ ఈ నిర్ణయం తీసుకున్నాడేమో అంటూ టాక్ వినిపిస్తుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇండియన్ 2 తర్వాత లోకేష్ దర్శకత్వంలో వచ్చే ఏడాది చివర్లో కమల్ ఒక సినిమాను చేయడం కన్ఫర్మ్ అంటూ తమిళ మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.
Please Read Disclaimer