ఆ సినిమా వద్దంటూ స్టార్ హీరోయిన్ కు వార్నింగ్

0

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోనే పెళ్లి తర్వాత మళ్లీ వరుసగా చిత్రాలు చేస్తూ బిజీ అయ్యింది. ఇటీవలే ఈమె లవ్ రాజన్ దర్శకత్వంలో రణబీర్ కపూర్ తో నటించేందుకు ఓకే చెప్పింది. అయితే ఆమె తీసుకుని నిర్ణయంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. లవ్ రాజన్ లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొన్నాడు.. ఇక రణబీర్ కపూర్ తో దీపిక ఒకప్పుడు ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ నడిపింది. ఇద్దరు కలిసి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కాని ఏవో కారణాల వల్ల బ్రేకప్ అయ్యి రణవీర్ సింగ్ ను వివాహం చేసుకుంది. ఈ రెండు కారణాల వల్ల ఆ సినిమా దీపిక చేయడం కరెక్ట్ కాదంటూ చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు.

2010లో దర్శకుడు లవ్ రాజన్ తనను ఒక సినిమా ఆడిషన్స్ కోసం వెళ్తే లైంగికంగా వేదించాడు అంటూ నటి ఆరోపించింది. ప్రస్తుతం ఆ ఆరోపణలపై ఎంక్వౌరీ జరుగుతుంది. లైంగిక వేదంపులు ఎదుర్కొంటున్న వారిని చాలా మంది స్టార్స్ పక్కకు పెట్టారు. ఇలాంటి సమయంలో దీపిక మాత్రం లవ్ రాజన్ తో సినిమా చేసేందుకు ముందుకు రావడం చర్చనీయాంశం అవుతుంది. ఈమె తీసుకున్న నిర్ణయంను చాలా మంది తప్పుబడుతున్నారు. లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎలా మీరు సమర్ధిస్తారు.. ఆయనతో సినిమా ఎలా చేస్తారు అంటూ సోషల్ మీడియాలో నాట్ మై దీపిక అంటూ హ్యాష్ ట్యాగ్ ను పోస్ట్ చేస్తున్నారు.

ఇక రణబీర్ కపూర్ తో ప్రేమాయణం సాగించిన దీపిక అతడి నుండి విడిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న నేపథ్యంలో మళ్లీ రణబీర్ కపూర్ తో నటించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. రణవీర్ సింగ్ తో వివాహం అయిన తర్వాత మళ్లీ పాత ప్రియుడితో ఎందుకు ఇలాంటి వ్యవహారాలు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు కారణాలు చూపుతు దీపికను ఆ సినిమా చేయవద్దంటూ నెటిజన్స్ కోరుతున్నారు. కొందరు రిక్వెస్ట్ చేస్తే మరి కొందరు మాత్రం తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. ఎవరేం అనుకున్నా కూడా దీపిక మాత్రం ఆయన దర్శకత్వంలో ఈయనకు జోడీగా నటించడం ఖాయంగా కనిపిస్తుంది.
Please Read Disclaimer