షూటింగ్ ఆపేయి డార్లింగ్.. అంటున్న అభిమానులు

0

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తున్న విషయం తెలిసందే. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ వలన వ్యాపారాలు ప్రభుత్వ ప్రైవేట్ కార్యకలాపాలు సినిమా షూటింగులు స్కూల్స్ ఇలా అన్ని నిలిపివేయాల్సి వస్తుంది. ఇప్పటికే మన దేశంలోని సినీ ఇండస్ట్రీలు షూటింగులను నిలిపేసాయి. మన తెలుగు హీరోలు కూడా ఎక్కడివారు అక్కడే షూటింగ్స్ ఆపేసి ఇంట్లో కూర్చున్నారు. బాహుబలితో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న డార్లింగ్ ప్రభాస్ మాత్రం రోజురోజుకి తన 20వ సినిమా షూటింగులో బిజీగా అయిపోతున్నాడు.

ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ సినిమాను చకచకా పూర్తీచేస్తున్నాడు. అయితే ఇటీవలే జార్జియాలో షెడ్యూల్ పూర్తీ చేసుకొని చిత్రయూనిట్ హైదరాబాద్ చేరుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ని యూరప్ లో ప్లాన్ చేశారట. కరోనా ఎఫెక్ట్ అన్ని దేశాలలో ఉండటం తో యూరప్ లో షూటింగ్ జరిపే పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది అక్కడి సినిమా యూనిట్ సమాచారం అందించనున్నట్లు తెలిపారు.

అయితే దేశవ్యాప్తంగా డార్లింగ్ అభిమానులు మాత్రం ప్రస్తుతానికి షూటింగ్ ఆపేయాలని కోరారట. ఎందుకంటే కరోనా భయానికి అందరూ షూటింగ్స్ ఆపేస్తుంటే మా ప్రభాస్ మాత్రం షూటింగ్ ప్లాన్ చేసి రిస్క్ తీసుకుంటున్నాడని అభిమానులు భావిస్తున్నారు. అయితే మేము ఏ మాత్రం కూడా షూటింగ్ చేయడానికి ఒప్పుకోమని డార్లింగ్ ప్రస్తుతానికి షూటింగ్ ఆపేయి అంటూ సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు. కరోనా గురించి పక్కన పెడితే డార్లింగ్ అభిమానులకు డార్లింగ్ ఆరోగ్యం పైన ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో చిత్రయూనిట్ గమనించాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-