ఆ ఎత్తుమడమలకు ఫ్యాన్సుంటారు!

0

ఫ్యాషన్ ప్రపంచంలో మహారాణి లా చెలామణి అవుతోంది మలైకా అరోరా ఖాన్. తనకంటూ ఒక ఫేజ్ 3 గాళ్స్ గ్యాంగ్.. అందులో తనకు తానుగానే రెబల్ క్వీన్ యాటిట్యూడ్ తో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. మోడ్రన్ ప్రపంచపు పోకడల్ని నషాలానికి ఎక్కించుకున్న ఈ అమ్మడిలో పాశ్చాత్య ధోరణిపై ఎన్ని విమర్శలు ఉంటాయో.. అంతకుమించిన పొగడ్తలు ఉంటాయి. మలైకా.. తన లైఫ్ లో రకరకాల డేరింగ్ స్టెప్స్ తో నిరంతరం మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. యువ హీరో అర్జున్ కపూర్ తో స్నేహం మొదలు ముంబై మీడియా నిరంతరం ఈ అమ్మడిపై ఏదో ఒక కథనం వండి వారుస్తూనే ఉంది.

ముఖ్యంగా మలైకా పబ్లిక్ అప్పియరెన్స్.. అందాల ఆరబోత గురించి యూత్ నిరంతరం వాడి వేడిగా మాట్లాడుకుంటూనే ఉంటారు. మలైకా జిమ్ కి వెళ్లినా.. లేదా యోగా చేసినా.. పబ్బు క్లబ్బు.. రెస్టారెంట్ ఎక్కడికి వెళ్లినా తన లుక్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటుందో తెలిసిందే. కుర్రకారు కళ్లు ఎప్పుడూ తననే వెంటాడాలన్నంతగా డిజైనర్ లుక్ తో మురిపిస్తుంటుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ బ్రాండ్ డిజైనర్ దుస్తుల్లో ఈ అమ్మడు ఇచ్చే ట్రీట్ ఆల్ టైమ్ హాట్ టాపిక్.

తాజాగా మరో సారి ఆ తరహాలోనే పబ్లిక్ కి చెమటలు పట్టించింది. ముంబైలోని ఓ అల్ట్రా రిచ్ ఏరియాలో ఫుట్ పాత్ మీదుగా నడుచుకుంటూ వెళుతున్న మలైకా స్పెషల్ అప్పియరెన్స్ హాట్ టాపిక్ గా మారింది. ఈ లుక్ యూనిక్ అనే చెప్పాలి. ఎవ్వర్ లేటెస్ట్ స్టైలిష్ స్ట్రిప్డ్ చారల షర్ట్ లో కనిపించింది. ఈ ఔట్ ఫిట్ కి కాంబినేషన్ గా రెడ్ హైహీల్ బూట్స్ ని ధరించి ప్యారిస్ నుంచి దిగొచ్చిన అల్ట్రా మోడ్రన్ హంసను తలపించింది. ఆ పొడవాటి కోట్ లాంటి షర్ట్ కి కాంబినేషన్ గా ఆ చేతిలో బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇక ఆ పొడవాటి కాళ్ల అందాన్ని ఈ డ్రెస్ అంతే ఎలివేట్ చేస్తోంది. మొత్తానికి మలైకా ఏం చేసినా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవ్వాల్సిందే మరి.
Please Read Disclaimer