మాస్క్ పెట్టుకోవమ్మా.. ఫ్యాన్స్ డిమాండ్ ఇది

0

యూరప్ లో షూటింగ్ కోసం వెళ్లినప్పుడు ప్రభాస్ మాస్క్ పెట్టుకునే వెళ్లాడు. విమానాశ్రయంలో వెళుతున్నప్పటి ఆ ఫోటో ఫ్యాన్స్ లో జోరుగా వైరల్ అయ్యింది. ఇక డార్లింగ్ గట్స్ కి మెచ్చని అభిమాని లేడు. ఇకపోతే యూరప్ షెడ్యూల్లో ఇటు కథానాయిక పూజా హెగ్డే సహా దర్శి లాంటి ఆర్టిస్టు కూడా పాల్గొంటున్నారు.

అయితే పూజా వ్యవహారం చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది. ప్రపంచం మొత్తం కరోనా కల్లోలంలో పడి కొట్టుకుపోతుంటే.. గజగజ ఒణికిపోతుంటే అదేమీ పట్టనట్టు అసలు మాస్క్ అన్నదే లేకుండా ఇలా డేర్ చేసిందేమిటో.. పైగా మాస్క్ అన్నదే లేకుండా జార్జియా వీధుల్లో తిరిగింది. సెల్ఫీలు.. ఫోటోలు అభిమానులకు షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన అభిమానులంతా ముందు మాస్క్ పెట్టుకో బుట్ట బొమ్మా.. ! అంటూ సలహా ఇస్తున్నారు.

ప్రభాస్ తో కలిసి జాన్ షూటింగ్ కోసం పూజా హెగ్డే జార్జియా లొకేషన్లను చుట్టేస్తోంది. అప్పటి నుండి తన ఇన్ స్టాగ్రామ్ లో రోజువారీ సంఘటనలపై రకరకాల సమాచారం అందిస్తోంది. కరోనా వైరస్ భయం కారణంగా చిత్రబృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని చెబుతూనే పూజా ఏమటో ఇలా చేసింది. విరామం లేకుండా షూటింగ్ చేస్తే సరిపోయిందా.. బయటకు వచ్చినప్పుడైనా మాస్క్ లేకపోతే ఎలా? అంటూ ఫ్యాన్స్ ఆందోళన పడిపోతున్నారు.

షూటింగ్ గ్యాప్ లో పూజా.. తన సిబ్బంది తో పాటు జార్జియా రాజధాని నగరం టిబిలిసిలోని పాత పట్టణానికి వెళ్ళింది. ఈ రోజుల్లో ప్రధాన పర్యాటక ప్రదేశాలు కూడా ఎడారిలాగా కనిపిస్తున్నాయని ఆమె వీడియోల ఆధారాల తో వెల్లడించింది. అన్నట్టు కరోనా భయం తో విదేశాల్లోనూ షూటింగ్ చేయొద్దని చాంబర్ కోరింది. మరి జాన్ షూటింగ్ ఆపకుండా కొనసాగిస్తున్నారా? ఏమిటీ మొండి పట్టు?
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-