కొత్త అందాలను కోరుతున్న అభిమానులు..

0

ప్రస్తుతం టాలీవుడ్ లో పూజ హెగ్డే రష్మిక మందనల టైం నడుస్తుంది. చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా దర్శక నిర్మాతలు వీరిద్దరి దగ్గరికే పరిగెడుతున్నారు. వీళ్ళు డేట్స్ అడ్జస్ట్ చేయలేనప్పుడు మాత్రమే వేరే హీరోయిన్లను కలుస్తున్నారు. ఇప్పటికే అభిమానులు పూజ రష్మికలను చూసి చూసి వేగి ఉన్నారు. ఇంకెంతకాలం సార్.. వీళ్ళిద్దరినే చూపిస్తారు అంటూ వాపోతున్నారు.

టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త రకం సినిమాలతో పాటు కొత్త అందాలను అభిమానులు కోరుకుంటున్నారు. నిజానికి రీసెంట్ గా రిలీజైన సరిలేరు నీకెవ్వరూ అల వైకుంఠపురంలో భీష్మ సినిమాలలో పూజ-రష్మికలనే చూసాం. అలాగే రాబోతున్న అయినను పోయిరావలె హస్తినకు అఖిల్ బ్యాచిలర్ బన్నీ లారీడ్రైవర్ సినిమాలలో కూడా వీరిద్దరినే ఎంపిక చేసినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.

తెలుగు ఇండస్ట్రీలో కొత్తవాళ్లకు అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదని సినీ అభిమానులు మండిపడుతున్నారు. ఇకనైనా దర్శక నిర్మాతలు పాతనీరును పక్కకు నెట్టి కొత్తనీరు రావడానికి అవకాశం కల్పించాలని అభిమానులు కోరుతున్నారు. ఇండస్ట్రీలో చాలా మంది అందమైన ఆకర్షణీయమైన హీరోయిన్లు ఉన్నారని వారిని కూడా తెరమీదకు తీసుకొచ్చి కనువిందు చేయాలని ఆశిస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-