నందమూరి హీరో కి ఫ్యాన్స్ సపోర్ట్

0

వచ్చే సంక్రాంతికి రెండు బడా సినిమాలు పోటీ లో ఉండగా కళ్యాణ్ రామ్ కూడా ‘ఎంత మంచి వాడవురా’ తో బరిలో దిగాడు. ఇప్పటికే ఈ మూడు సినిమాలు డేట్స్ లాక్ చేసేసుకొని ప్రమోషన్స్ తో హైప్ పెంచుకునే పని లో ఉన్నాయి. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలున్నా కంటెంట్ బాగుంటే ఆడెస్తాయనేది జగమెరిగిన సత్యమే.

ఆ దైర్యంతోనే ‘ఎంత మంచి వాడవురా’ ను సంక్రాంతి పోటిలో ఉంచారు మేకర్స్. నిజానికి 2017 లో అటు మెగా స్టార్ రీ ఎంట్రీ ఇటు బాలయ్య ప్రతిష్టాత్మక సినిమా పోటీలో ఉన్నప్పటికీ ‘శతమానం భవతి’ సినిమా మంచి వసూళ్ళు సాదించి ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ లోకి రప్పించింది. అందుకే ఈసారి కూడా ఇద్దరు బడా హీరోల సినిమాలు ఉన్నప్పటికీ ‘ఎంత మంచి వాడవురా’ ను కూడా బరి లోకి దింపాడు సతీష్ వేగేశ్న.

అయితే రెండు బడా సినిమాల కు ఫ్యాన్స్ సపోర్ట్ బాగా ఉంది. మహేష్ ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ ఇలా ఎవరి సినిమా ను వారు సోషల్ మీడియా లో లిఫ్ట్ ఇచ్చే పనిలో ఉన్నారు. అందుకే కళ్యాణ్ రామ్ కి సపోర్ట్ గా ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దిగారు. ప్రతీ సారి కళ్యాణ్ రామ్ కి అంతో ఇంతో సపోర్ట్ ఇచ్చే తారక్ ఫ్యాన్స్ ఈసారి సంక్రాంతి పోటీ లో అపోజిట్ హీరోల సినిమాలు ఉండటంతో నందమూరి హీరో కి తమ పూర్తి మద్దతు తెలిపి సోషల్ మీడియా లో బాగా ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యారు. తాజాగా యూ ట్యూబ్ లో కళ్యాణ్ రామ్ మాస్ సాంగ్ కింద ఇవే కామెంట్స్ పెట్టుకున్నారు. ఈసారి సపోర్ట్ ఇవ్వాల్సిందే అంటూ ఫ్యాన్స్ అందరూ ఏకమయ్యారు. మరి తమ్ముడి ఫ్యాన్స్ సపోర్ట్ ఒకే అదే రేంజ్ లో టికెట్లు తెగుతాయా చూడాలి.
Please Read Disclaimer