నటవారసురాలు మీద పడి మరీ సెల్ఫీ!

0

స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ వారసురాలు సారా అలీఖాన్ కేదార్ నాథ్- సింబా లాంటి చిత్రాలతో ఇప్పటికే రేసులోకి దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. సింబా చిత్రంతో ఆరంభమే బ్లాక్ బస్టర్ విజయం అందుకుని ఆరంగేట్రాన్ని ఘనంగానే చాటుకుంది. ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాలకు కమిటైంది. ఇక స్టార్ వారసురాలు అయినా.. పటౌడీ సంస్థానంలో గొప్ప బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. ఏనాడూ సారాలో అతి అన్నదే కనిపించదు. వేల కోట్ల సంస్థానాధీశుని వారసురాలిగా కించిత్ గర్వం కూడా కనిపించదు.

పబ్లిక్ అప్పియరెన్స్ లోనూ అంతే. ఈ అమ్మడి నవ్వు ఎంతో ఆకర్షణగా ఉంటుంది. చిరునవ్వుతోనే పరిసరాల్ని ఆహ్లాదంగా మార్చేస్తుంటుంది. ఎక్కడకు వెళ్లినా పదిమందిలో ఒదిగి ఉండే గుణం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తను ఎంత స్వీట్ గా మాట్లాడుతుందో అంతకుమించి అభిమానులతో స్వీటెస్ట్ గాళ్ అనిపించుకుంటోంది.

ఇంతకుముందు విమానాశ్రయం నుంచి తన లగేజ్ బ్యాగులు తనే మోస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. తన వెంట పనివాళ్లు ఉన్నారు కదా.. వాళ్లకు లగేజ్ ని అప్పజెప్పలేదు ఈ భామ. ఆ చర్యకు అభిమానులే కాదు విమానాశ్రయంలో చూపరులు హ్యాట్సాఫ్ చెప్పారు. లేటెస్టుగా సారా ఓ షూటింగ్ ముగించుకుని విమానాశ్రయం నుంచి వస్తుంటే అభిమానులు గుమిగూడి మీద పడ్డారు. అంతేనా తనతో ఫోటోల కోసం సెల్ఫీల కోసం ఆరాటపడ్డారు. ఒక అభిమాని అయితే తనను తాకేంతగా మీదికొచ్చేశాడు. అయినా ఎక్కడా కోపం అన్నదే లేకుండా అందరికి ఎంతో ఓపిగ్గా సెల్ఫీలు ఇచ్చింది. తనని అభిమానిస్తున్న ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు తెలిపింది. ఓవైపు ఫ్యాన్స్ మీదికి దూసుకొస్తున్నా ఆ ఎపిసోడ్ లో సెక్యూరిటీని సహనంగా వెయిట్ చేయించిందే కానీ సారా అసహనం వెల్లగక్కకపోవడం చూస్తుంటే ఒదిగి ఉండే తత్వం అర్థమవుతోంది. కూలీ నంబర్ 1 రీమేక్ సహా ఇంతియాజ్ అలీ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తోంది.
Please Read Disclaimer