సినిమాల వెల్లువ..కానీ ప్రేక్షకుల ఇంట్రెస్ట్ బన్నీ పాటపైనే!

0

పెద్ద సినిమాలు కనుక పోటీలో లేకపోతే చాలు.. చిన్న సినిమాల ఫిలిం మేకర్లు విడుదలకు ప్లాన్ చేస్తారు. ఒక్కోసారి అరడజను చిన్న సినిమాలు కూడా ఒకేరోజున రిలీజ్ అవుతాయి. రేపు శుక్రవారం అలాంటి పరిస్థితే ఉంది. ఈ శుక్రవారం మొత్తం ఆరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో హాలీవుడ్ ఫిలిం ‘ఫ్రోజెన్ 2′(తెలుగు వెర్షన్) కూడా ఉంది.

స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చూస్తే ‘రాగల 24 గంటల్లో’.. ‘బీచ్ రోడ్ చేతన్’.. ‘జార్జ్ రెడ్డి’.. ‘తోలు బొమ్మలాట’.. ‘జాక్ పాట్’ ఉన్నాయి. ఈ ఐదు సినిమాల్లో కాస్త క్రేజ్ ఉన్న సినిమా ‘జార్జ్ రెడ్డి’ మాత్రమే. ఇంటెన్స్ ట్రైలర్ తో యూత్ ను ఆకర్షించిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ‘బీచ్ రోడ్ చేతన్’ సినిమాకు క్రేజ్ లేదు కానీ మొదటి ఆటను టికెట్ కొనకుండా ఉచితంగా చూడవచ్చని ఓ క్రేజీ ఆఫర్ ఇవ్వడంతో ఈ సినిమాపై కూడా ఉచిత ఆఫర్ల ప్రేమికుల సమాజం వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీగా వస్తుంది అంటే దేన్నీ వదలని నైజం ఎక్కువమందికి ఉంటుంది కాబట్టి ఈ సినిమా మొదటి ఆటపై ఆసక్తి ఉంది. టాక్ ను బట్టే ఈ సినిమా మిగతా షోల సంగతి ఎలా ఉంటుందో తెలుస్తుంది.

ఈ శుక్రవారం సినిమాలను పరిశీలిస్తే ‘జార్జ్ రెడ్డి’ తప్ప ప్రేక్షకుల్లో తప్పనిసరిగా చూడాలనే ఆసక్తి కలిగిస్తున్న సినిమా ఒక్కటీ లేదని అభిప్రాయం వినిపిస్తోంది. నిజానికి ఈ వారంలో రిలీజ్ అవుతున్న సినిమాల కంటే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా నుండి విడుదల కానున్న ‘ఓ మై గాడ్ డాడీ’ పాటకోసం ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటూ ట్రేడ్ సర్కిల్స్ లో సెటైర్లు కూడా పడుతున్నాయి.
Please Read Disclaimer