ఇలా చేశావేంటి చరణ్ అంటున్న అభిమానులు!

0

అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ‘సైరా’ మూవీకి తెలుగులో కలెక్షన్స్ బాగానే ఉన్నా మిగిలిన తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుని అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న హిందీ మార్కెట్ వల్లే సైరా సినిమాకి పెద్ద దెబ్బ తగిలింది. హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన ‘వార్’ మూవీకి పోటీగా రిలీజ్ అయిన ‘సైరా’ ఆ సినిమా ధాటికి తట్టుకోలేక బొక్కబోర్లా పడింది.

పైపెచ్చు హిందీలో ఈ సినిమాకు చేసిన ప్రమోషన్స్ కూడా అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ప్రమోషన్స్ అన్నీ చాలా నాసిరకంగా ఉన్నాయని మెగాభిమానులు మండిపడుతున్నారు. తమ హీరో సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు హిందీ ప్రేక్షకులు ఇచ్చిన తీర్ఫును రుచించుకోలేకపోతున్నారు. అమితాబ్ కిచ్చా సుదీప్ విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ ని పెట్టుకున్నా వాళ్ళ వాళ్ళ భాషల్లో కనీసం ఓపెనింగ్స్ కూడా సరిగా లేవని అభిమానులు చరణ్ ని ప్రశ్నిస్తున్నారు.