పెళ్లికి సిద్దమైన లవ్ బర్డ్స్

0

ఈమద్య కాలంలో బాలీవుడ్ ప్రేమ పక్షి జంటలు వరుసగా పెళ్లికి సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే కొందరు పెళ్లి పీఠలు ఎక్కి దంపతులుగా మారగా త్వరలోనే మరికొన్ని ప్రేమ జంటలు కూడా భార్య భర్తలుగా మారేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ రెండవ పెళ్లికి సిద్దం అయ్యాడు. గత కొంత కాలంగా ఈయన నటి షిబాని దండేకర్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరి ప్రేమ విషయం బి టౌన్ లో ప్రతి ఒక్కరికి తెల్సిందే. వీరి పెళ్లి కోసం బాలీవుడ్ వర్గాల వారు ఎదురు చూస్తున్నారు.

ఈ ఏడాది వీరి పెళ్లి అవ్వడం కన్ఫర్మ్ అంటూ వారి సన్నిహితులు ప్రకటించారు. ఇప్పటికే వీరు ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. వారిద్దరి చేతి వేళ్లకు రింగ్స్ కనిపిస్తుండటం వల్ల బయటి వారికి తెలియకుండా వీరి ఎంగేజ్ మెంట్ అయిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఫర్హాన్ తుఫాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రం పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడట.

పెళ్లికి సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాని పెళ్లి షాపింగ్ తో పాటు ఇతర పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. 2016లో మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన ఫర్హాన్ తన ఇద్దరు కూతుర్లను తన వద్దే ఉంచుకున్నాడు. అప్పటి నుండి సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తున్న ఫర్హాన్ కు కొంత కాలం క్రితం నటి షిబాని పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఈ ఏడాది పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-