బాలీవుడ్ ప్రేమ జంట.. పూల్ లో పోజు!

0

ఒక్క విషయంలో పేరు తెచ్చుకునేందుకే కొందరికి జీవితకాలం సరిపోతుంది. కానీ కొందరు మల్టి టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు. వారికి మాత్రం ఏ పనైనా ఇవ్వండి అందులో స్పెషలిస్ట్ ఎలా చేస్తారో అలా చేస్తారు. దానర్థం అన్నిట్లో వేలు పెట్టి కెలికి చెడగొట్టే రకాలు కాదు. పర్ఫెక్షన్ కు ప్రతిరూపంగా ఉండేవారు.. అలాంటి వారిలో ఫర్హాన్ అఖ్తర్ ఒకరు. డైరెక్టర్ గా .. యాక్టర్ గా.. ప్రొడ్యూసర్ గా అయన ఇప్పటికే సత్తా చాటాడు.. సింగర్ గా.. పాటల రచయితగా కూడా అయన టాలెంట్ చూపించాడు.

ఇదంతా అయన ప్రొఫెషనల్ వ్యవహారం.. పర్సనల్ లైఫ్ లో ఫర్హాన్ మొదటి భార్య అధున కు విడాకులు ఇచ్చి సింగిల్ గా మారాడు.. అయితే సింగిల్ గా ఉన్నప్పుడు మొదట వచ్చే ఆలోచన ఎవరో ఒకరితో మింగిల్ కావాలనే.. కదా? అలాంటి ఉద్దేశంతోనే కత్తిలాంటి బాలీవుడ్ బ్యూటీ షిబాని దండేకర్ తో ఎఫైర్ కొనసాగిస్తున్నాడు. ఇద్దరూ ఏమాత్రం అరమరికలు లేకుండా ప్రేమించుకుంటూ .. ఆ ప్రేమను ఈ సభ్యసమాజానికి వెల్లడిస్తున్నారు. దాదాపు ఏడాదిగా డేటింగ్ లో ఉన్న ఈ జంట త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతుందని కూడా బాలీవుడ్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి ఆ సంగతేమో కానీ ఫర్హాన్ సాబ్ తన హాట్ గర్ల్ ఫ్రెండ్ తో అచ్చికబుచ్చికలాడే ఫోటోలను షేర్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలో ఇద్దరు స్విమ్మింగ్ పూల్ లో కూర్చొని బాలీవుడ్లో ఉన్న హాటెస్ట్ కపుల్ లాగా పోజిచ్చారు.

ఇద్దరూ ఫిట్నెస్ ఫ్రీక్ అనే పదానికి ప్రతీకలు కావడంతో హాలీవుడ్ జోడీలా కనిపిస్తున్నారు. వీటన్నిటికీ తోడుగా అఖ్తర్ సాబ్ ఎర్ర నిక్కర్ వేసుకుంటే.. షిబాని బేగం ఎర్ర బికినీ వేసుకుని మ్యాచింగ్ మ్యాచింగ్ అన్నట్టుగా పోజిచ్చారు. రెడ్ అంటే చాలా అర్థాలు ఉన్నాయి కానీ డీప్ లవ్ కు కూడా రెడ్ ఒక సింబల్. డీప్ గా లేని ఈతకొలనులో ఉన్నారేమో కానీ పీకల్లోతు ప్రేమలో మాత్రం మునిగితేలుతున్నట్టున్నారు. సినిమాల విషయానికి వస్తే ఫర్హాన్ ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా.. జైరా వసీమ్ ఇతర కీలక పోషిస్తున్నారు.
Please Read Disclaimer