ఫిబ్రవరి: ఆ ఒక్కటి తప్ప మిగతా వాటికి హైపే లేదు!

0

ప్రతి వ్యాపారానికి బేరాలు సరిగా లేని సీజన్ ఉంటుంది. అదే అన్ సీజన్. మన టాలీవుడ్ కు ఇలాంటి అన్ సీజన్లు ఉన్నాయి. అందులో ఫిబ్రవరి మార్చి నెలలు ఉంటాయి. కారణం అందరికీ తెలిసిందే.. విద్యార్థులకు పరిక్షల సీజన్. అందుకే పెద్ద సినిమాల రిలీజులు ఈ సీజన్లో పెట్టుకోరు. కానీ చిన్న సినిమాలు.. మీడియం రేంజ్ మూవీస్ మాత్రం ఈ సీజన్ పై కన్నేస్తాయి. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కాబట్టి దానికి అటు ఇటుగా లవ్ స్టొరీలతో తమ లక్కును టెస్ట్ చేసుకుంటారు ఫిలింమేకర్లు.

ఎప్పటిలాగే ఈసారి ఫిబ్రవరి రిలీజులు కూడా పెద్దగా బజ్ లేకుండా ఉన్నాయి. విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ప్రేక్షకులలో పెద్దగా అసక్తి కలిగించలేకపోయింది. ప్రోమోస్ లో ‘అర్జున్ రెడ్డి’ ఛాయలు కనిపిస్తూ ఉండడం కొంత మైనస్ గా మారింది. ఇక శర్వానంద్ – సమంతా నటించిన ‘జాను’ పై కూడా పెద్దగా హైప్ లేదు. ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ సినిమా అసలు విడుదల అవుతుందా లేదా అనేది కూడా చాలామందికి తెలియదు. ఇక ఈ సీజన్లో కాస్త బజ్ ఉన్న సినిమా నితిన్ ‘భీష్మ’. నిజానికి ఈ సినిమాపై కూడా పెద్దగా హైప్ లేదు కానీ ఈమధ్య ‘వాటే బ్యూటీ’ పాట విడుదల చేయడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. నితిన్- రష్మిక స్టెప్పులు.. యువతకు.. మాసు కు వెంటనే కనెక్ట్ అయ్యాయి. ఇలాంటి ప్రోమోస్ కనుక కొనసాగితే మాత్రం ‘భీష్మ’ కు మంచి హైప్ వచ్చే అవకాశం ఉంది.

అన్ సీజన్ అయిన ఈ ఫిబ్రవరి బాక్స్ ఆఫీస్ లో ఏ హీరో విజయబావుటా ఎగరెస్తాడో తెలియాలంటే మాత్రం వేచి చూడకతప్పదు. ఒక్కటి మాత్రం నిజం.. హైప్..బజ్ ఎలా ఉన్నా ప్రేక్షకులను మెప్పించే అద్భుతమైన కంటెంట్ ఉంటే మాత్రం ఆ సినిమాలు విజయం సాధిస్తాయి. అందులో మాత్రం అనుమానం లేదు.
Please Read Disclaimer