పండగే కాదు.. తర్వాత కూడా సినిమాల మోతే!

0

తెలుగు సినిమాలకు పెద్ద సీజన్లంటే సంక్రాంతి.. దసరా అని చెప్పుకోవాలి. ఈ సీజన్ లో పెద్ద సినిమాలు క్యూ కడతాయి. బాక్స్ ఆఫీస్ పోటీ తారాస్థాయిలో ఉంటుంది. ఈసారి సంక్రాంతికి కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’.. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇవి కాకుండా కళ్యాణ్ రామ్ నటించిన ‘ఎంత మంచివాడవురా’ కూడా పోటీలో ఉంది. రజనీకాంత్ ‘దర్బార్’ కూడా జనవరి రేసులోనే ఉంది.

సంక్రాంతికి పోటీ ఉంటుంది.. ఆ సీజన్ అయిన తర్వాత పెద్దగా సినిమాలు ఉండవని అనుకుంటారేమో కానీ సంక్రాంతి సీజన్ పూర్తయిన తర్వాత వరసగా సినిమా రిలీజ్ ఉన్నాయి. జనవరి చివరివారం నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి వరకూ దాదాపు అరడజను సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

1. అశ్వత్థామ: నాగశౌర్య.. మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు రమణ తేజ. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

2. భీష్మ: నితిన్.. రష్మిక మందన్న హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు.

3. 96: శర్వానంద్.. సమంతా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తమిళ హిట్ ఫిలిం ’96’ రీమేక్. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

4. డిస్కోరాజా: రవితేజ నభ నటేష్ హీరో హీరోయిన్లు. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.

5 . ఆకాశం నీ హద్దురా: సూర్య.. అపర్ణ.. మోహన్ బాబు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు సుధ కొంగర దర్శకురాలు. ఈ సినిమాను 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య నిర్మిస్తున్నారు.

ఇవి కాకుండా ఇంకా మూడు నాలుగు సినిమాలు ఫిబ్రవరి లిస్టులో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. వాటిలో నాగచైతన్య-శేఖర్ కమ్ముల సినిమా ఒకటి. ఇంకా మిగతా మిగతా సినిమాల వివరాలు అందాల్సి ఉంది. అంటే పండగ తర్వాత కూడా వరసబెట్టి సినిమాల రిలీజులు ఉన్నాయన్నమాట.
Please Read Disclaimer