పచ్చని పాటతో పండగ తెచ్చారులే

0

పండగలు పబ్బాల వేళ ఇంటిల్లిపాదీ బంధుమిత్రులు పిల్ల పాపలతో ఎంతో సందడిగా ఉంటుంది. అది దసరా అయినా దీపావళి అయినా సంక్రాంతి అయినా ఇంకేదైనా పండగ పండగే. భారతీయ సనాతన సాంప్రదాయంలో కుటుంబ జీవనం ఉమ్మడి కుటుంబం అనేది ఉండేది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా కుటుంబ విలువలు అడుగంటాయి. ఉమ్మడి కుటుంబాల్ని జల్లెడ వేసి వెతకాల్సిన పరిస్థితి తలెత్తింది. బంధాలు అనుబంధాలు కమర్షియల్ కాటకంలో కాలిపోయాయ్. అందుకే ఈ కాన్సెప్టుతో ఎన్ని సినిమాలు తీసినా ఎన్ని పాటలు వచ్చినా వాటికి ఆదరణ దక్కుతూనే ఉంది.

అలా ఉంటే బావుంటుందేమో..! అన్న సందిగ్ధతలో కలిసిపోయి తిరిగి సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. ఫ్యాక్టరీ ఉద్యోగం అంటూ ఏదో గడబిడలో కమర్షియల్ కార్పొరెట్ లైఫ్ లో నిమగ్నమైపోవాల్సిన దుస్థితి నేటి సగటు మనిషికి ఉంది. అందుకే సాయిధరమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా టైటిల్ వినగానే పండగ తెచ్చినట్టే అనిపించింది. దర్శకుడు ఇందులో బంధాలు అనుబంధాల్ని టచ్ చేస్తున్నారనే అర్థమైంది. ప్రతిరోజు పండగే అంటూ చక్కని టైటిల్ ని ఎంచుకుని మారుతి మనసుల్ని గెలుచుకున్నారు.

తాజాగా టైటిల్ లిరికల్ పాటను రిలీజ్ చేశారు. పది మంది వున్నా.. పడి..నవ్వుతున్నా పండగే అంటూ సాగే గ్రూప్ సాంగ్ ఆకట్టుకుంటోంది. పండగ నేపథ్యంలో ఈ పాటలోని లిరిక్ ఎంతో సరళంగా సింపుల్ గా ఆకట్టుకుంది. సాహితీ పరిభాష అనే కంటే వచన కవిత్వం అని దీనిని చెప్పొచ్చు. ఇక ట్యూన్ పరంగా సాంప్రదాయబద్ధంగా ఉంది.. రొటీనిటీతోనే ఫర్వాలేదనిపించింది. ఈ సినిమా ఆల్బమ్ లో తన ఫేవరెట్ టైటిల్ సాంగ్ అంటూ సాయిధరమ్ స్వయంగా అభిమానులకు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. మరి ఇక పండగ మొదలైనట్టే. తెరపై బంధాలు అనుబంధాల్ని మారుతి తనదైన శైలిలో కామిక్ వేలో ఎమోషన్స్ తో ఎలా చూపించారు? అన్నది చూడాలి. ముఖ్యంగా సత్యరాజ్ తాతతో సాయిధరమ్ మనవడి పరాచికాలు బాగానే ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా రంజింపజేసేలా పల్లె పట్టు సాంప్రదాయం.. పచ్చందాన్ని.. వరి పొలాల్ని ఇందులో చూపిస్తున్నారు. రాశీ ఖన్నా పట్టు పరికిణీ అందచందాలు మరో ప్లస్ కానున్నాయి. అన్నట్టు రాశీ టిక్ టాక్ సుందరిగానూ మైమరిపించబోతోంది. తాజా లిరికల్ వీడియోలో దర్శకుడు మారుతి కూడా కనిపించారు
Please Read Disclaimer