ఈసారి మనోళ్ల పేర్లు అక్కడ మారుమ్రోగడం ఖాయం

0

టాలీవుడ్ లో ఫైట్ మాస్టర్స్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేర్లలో ముందు వరుసలో ఉండే పేర్లు రామ్ లక్ష్మణ్. వీరిద్దరు గత రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ లో ఫైట్ మాస్టర్స్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు వర్క్ చేసిన విషయం తెల్సిందే. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్ లో సైతం వీరు సత్తాచాటారు. ఈసారి వీరు బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అయ్యారు. భారీ యాక్షన్ మూవీ బాగి 3 చిత్రంలోని పలు యాక్షన్ సన్నివేశాలను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ డిజైన్ చేశారట.

బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ బాగి అంటూ ఇప్పటికే రెండు సార్లు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ దక్కించుకున్నాడు. యాక్షన్ హీరోగా ముద్రపడ్డ టైగర్ మరో సక్సెస్ కోసం బాగి 3 ని చేశాడు. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతా అనుకున్నట్లుగానే మొదటి రెండు పార్ట్ ల కంటే ఈసారి మరింత యాక్షన్ ను టైగర్ చూపించబోతున్నాడని ట్రైలర్ ను బట్టి అర్థం అవుతుంది.

ఈసారి టైగర్ యాక్షన్ సీన్స్ ను రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వీరిద్దరితో పాటు కిచ్చా మాస్టర్ బాగి 3 కి యాక్షన్ కొరియోగ్రఫీ చేయడం జరిగింది. యాక్షన్ సీన్స్ లో మెజార్టీ పార్ట్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసినట్ లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. బాగి 3 తర్వాత బాలీవుడ్ లో రామ్ లక్ష్మణ్ పేరు మారుమ్రోగడం ఖాయంగా అనిపిస్తుంది. వరుసగా సూపర్ స్టార్స్ సినిమాలకు స్టార్ హీరోల సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేస్తూ ఇప్పటికే బిజీగా ఉన్న ఈ మాస్టర్స్ త్వరలో బాలీవుడ్ లోనూ బిజీ అయ్యే అవకాశం కనిపిస్తుందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer