వీడియో: సాహో శ్రద్ధ కవలలా?

0

ప్రస్తుతం ఏ నోట విన్నా `సాహో` గురించే మాట్లాడుతున్నారు. మరో 8రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో డార్లింగ్ ప్రభాస్ సరసన నటించిన కథానాయిక శ్రద్ధా కపూర్ గురించి ఉత్తరాది-దక్షిణాది అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పాపులరైన శ్రద్ధా `సాహో` లాంటి భారీ చిత్రంలో నటించింది. ప్రభాస్ కి సరిజోడు కుదిరింది అంటూ ఫ్యాన్స్ ఎంతో మురిసిపోతున్నారు. సైకో సయ్యారే సాంగ్ లో శ్రద్ధా అందచందాల గురించి అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకున్నారు. అంత క్రేజు ఉన్న కథానాయిక కాబట్టే క్షణం తీరిక లేనంత బిజీగా వరుసగా సినిమాలు చేస్తోంది శ్రద్ధ.

ఓవైపు సాహో చిత్రంలో నటిస్తూనే బాలీవుడ్ లో ఈ అమ్మడు మూడునాలుగు సినిమాలు ఏకకాలంలో చేస్తోంది అంటే ఎలాంటి హార్డ్ వర్కరో అర్థం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టే భారీగా పారితోషికాలు అందుకుంటోంది. ఒక్కో సినిమాకి 3-7 కోట్ల పారితోషికం అందుకుంటూ ఏడాదికి 20కోట్ల రెవెన్యూ ఆర్జిస్తోందన్న గణాంకాలు వెలువడ్డాయి. 2019లో వరుసగా `సాహో`తో పాటుగా.. వరుణ్ ధావన్తో `స్ట్రీట్ డ్యాన్సర్` చిత్రంలో నటిస్తూనే సుశాంత్సింగ్ సరసన `చిచ్చోర్`లో ఆడిపాడుతోంది.

చిచ్చోర్ సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి తాజాగా `ఫికర్ నాట్ .. `అనే వీడియో గీతాన్ని లాంచ్ చేశారు. ఈ పాట ఆద్యంతం అద్భుతమైన కొరియోగ్రఫీ.. విజువల్ గ్రాండియారిటీ .. ఆర్టిస్టుల ఫన్ మూవ్ మెంట్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ పాటలో శ్రద్ధా ద్విపాత్రాభినయం అభిమానులకు కన్నులపండుగేనని చెప్పాలి. ప్రీతమ్ చక్రబర్తి సంగీతం ఆకట్టుకుంది. ఇక ఈ పాటలో కాస్త మోడ్రన్ లుక్ అమ్మాయిగా.. అలాగే పూర్తి ట్రెడిషనల్ లుక్ తో ట్విన్స్ పాత్రలో శ్రద్ధా కనిపిస్తోంది. ఇందులో సుశాంత్ సింగ్- వరుణ్ శర్మ- ప్రతీక్ తదితరులు నటించారు. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. అంటే సాహో రిలీజైన 36 రోజుల్లోనే శ్రద్ధా నటించిన మరో క్రేజీ చిత్రం రిలీజవుతోందన్నమాటPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home