సినిమా కోసమే చెయిన్ స్మోకర్ నయ్యా!

0

పాత్రలోకి పరకాయం చేయడం కొందరు హీరోలకు అలవాటు. క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలంటే త్యాగాలు తప్పనిసరి. ఒక్కోసారి రిస్కీ సాహసాలు చేయాలి. అయితే మరీ అంత ప్రమాదకరం కాకపోయినా ఇస్మార్ట్ శంకర్ సినిమా కోసం తనకు నచ్చని ఓ హ్యాబిట్ కి రామ్ అలవాటు పడ్డాడట. ఈ మూవీ కోసం పొగరాయుడిగా మారాల్సొచ్చిందట.

అది తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పలేదని… ఆ పాత్ర స్వభావం ప్రకారం.. చెయిన్ స్మోకర్ గా తెర పై కనిపించాల్సొచ్చిందని రామ్ తెలిపారు. అందుకోసం ఏకంగా సిగరెట్ మీద సిగరెట్ కాల్చాల్సి వచ్చిందట. ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా కానీ అది తప్పలేదు. షూటింగ్ సమయంలో రెగ్యులర్ గా స్మోకింగ్ తప్పేది కాదని రామ్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే షూటింగ్ ఏరోజు పూర్తయిందో అదే రోజు పొగ తాగడం కూడా ఆపేశాడట.

అయితే తాను ఏం చేసినా అది ఆ పాత్రను పండించేందుకే. దానికోసం ఎంతకైనా వెళతానని అన్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాపై క్రిటిక్స్ లో మిశ్రమ స్పందనలు వచ్చినా రామ్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్సెస్ గురించి మాత్రం ఎవరూ పేరు పెట్టలేదు. ప్రస్తుతం టీమ్ సక్సెస్ ని ఆస్వాధిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు పూరి ఇదే ఊపులో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ని తెరకెక్కిస్తాడని ప్రచారం అవుతోంది. ఒకవేళ సీక్వెల్ తీస్తే రామ్ మరోసరి సిగరెట్ల పొగ గుప్పు గుప్పుమని లాగాల్సి ఉంటుందేమో!
Please Read Disclaimer