నిర్మాత ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోల సీఎంకు విజ్ఞప్తి

0

కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాత కపాలి మోహన్ నిన్న రాత్రి సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని మృతి చెందాడు. కన్నడ సినీ పరిశ్రమలో సుపరిచితుడు అయిన కపాలి మోహన్ కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడట. సినిమా పరిశ్రమకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్న ఈయన హోటల్ బిజినెస్ ను నిర్వహిస్తూ ఉన్నాడట. ఈ క్రమంలో హోటల్ బిజినెస్ లో కూడా నష్టాలు రావడంతో ఆర్థిక సమస్యలు మరింతగా పెరిగి చివరకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా చెబుతున్నారు.

రాత్రి స్నేహితుడు మంజునాథ్ తో కలిసి భోజనం చేసిన మోహన్ ఆ తర్వాత తన హోటల్ కు వెళ్లి స్నేహితుడితో పాటు పడుకున్నాడు. స్నేహితుడు ఘాడ నిద్రలో ఉన్న సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. మోహన్ ఉరి వేసుకోవడానికి ముందు ఒక సెల్ఫీ వీడియోను రికార్డు చేశాడు. ఆ వీడియోలో తాను ఆర్థికంగా చాలా చితికి పోయాను.

తాను చేస్తున్న హోటల్ వ్యాపారంలో తీవ్ర నష్టాలు వస్తున్నాయి. ఆ కారణంగానే నేను ఉరి వేసుకుంటున్నాను.. నా కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కర్ణాటక సీఎంకు నిర్మాత మోహన్ విజ్ఞప్తి చేశాడు. తన చావుకు ఆర్ధిక సమస్యలే తప్ప మరే కారణం కాదని ఆయన వీడియోలో క్లారిటీగా చెప్పాడంటూ పోలీసులు నిర్థారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యగా నిర్థారించినట్లుగా ప్రకటించారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-