జూనియర్ కేజీఎఫ్ అప్ డేట్ ఇచ్చిన అమ్మ

0

కేజీఎఫ్ తో ఆల్ ఇండియా క్రేజ్ ను దక్కించుకున్న యశ్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన పిల్లల గురించి కూడా మీడియాలో రెగ్యులర్ గా అప్ డేట్ వస్తూనే ఉంటుంది. యశ్ కూతురు ఐరా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ఫొటోలతో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక యశ్ తనయుడు కూడా ఈమద్య సోషల్ మీడియాలో ఆటలు ఆడేస్తున్నాడు.

యశ్ భార్య రాధిక పండిట్ తన కొడుక్కు సంబంధించిన విషయాలను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ వస్తోంది. గత కొన్ని రోజులుగా యశ్ తనయుడి పేరు విషయంలో సస్పెన్స్ నెలకొంది. ఆ సస్పెన్స్ కు తెర దించే సమయం వచ్చిందని రాధిక పేర్కొంది. జూనియర్ కేజీఎఫ్ పేరును ప్రకటించబోతున్నట్లుగా ఆమె పేర్కొంది. ఇప్పటికే ఖరారు అయిన పేరును త్వరలో ప్రకటిస్తామని ఆమె పేర్కొంది.

యశ్ తన ఇద్దరు పిల్లలతో సరదా సమయంను ఈ లాక్ డౌన్ టైం లో గడిపాడు. ఇటీవలే కేజీఎఫ్ 2 చిత్రం షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టాలనే పట్టుదలతో యశ్ ఉన్నాడు. రికార్డ్ స్థాయి బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. అయితే ప్రస్తుతం ఆయన క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న కారణం ప్రశాంత్ నీల్ ఏం చేయబోతున్నాడు అనే విషయంలో చర్చ జరుగుతోంది.