మూడేళ్లకు ఆ స్టార్ హీరో మూవీకి లైన్ క్లియర్

0

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉన్న దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. ప్రేమ కథా చిత్రాలను అద్బుతంగా తెరకెక్కించగల దర్శకుడు ఈయన. ఇప్పటి వరకు ఈయన నుండి వచ్చిన పలు సినిమాలు తెలుగు మరియు తమిళంలో మంచి విజయాలను దక్కించుకున్నాయి. అయితే ఈమద్య కాలంలో ఈయన సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. టైం బాగలేకానో లేదా మరేంటో కాని గత మూడు సంవత్సరాలుగా ఈయన సినిమాలకు ఫైనాన్సియల్ సమస్యలు తలెత్తుతున్నాయి. తమిళ స్టార్ హీరో ధనుష్ తో ఈయన తెరకెక్కించిన క్రేజీ మూవీ ‘ఎన్నై నొక్కి పాయం తొట్టా’ మూడేళ్లుగా ప్రేక్షకులను ఊరిస్తూ వస్తోంది. ఎట్టకేలకు ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.

ధనుష్ మరియు గౌతమ్ మీనన్ మూవీ అనగానే అంచనాలు ఒక్కసారిగా భారీగా వచ్చాయి. అందరు అనుకున్నట్లుగానే సినిమాను ఆరు నెలల్లోనే గౌతమ్ మీనన్ పూర్తి చేశాడు. కాని ఫైనాన్సియర్స్ వివాదం కారణంగా సినిమా విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఆ వివాదాలన్నీ కూడా సమసి పోయి విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే తెలుగులో కాస్త ఆలస్యంగా విడుదలవ్వొచ్చు అంటున్నారు.

నితిన్ హీరోగా తెరకెక్కిన ‘లై’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మేఘా ఆకాష్ ఈ చిత్రంలో ధనుష్ కు జోడీగా నటించింది. ఇప్పటికే విడుదలైన చిత్రం ఫస్ట్ లుక్ మరియు ప్రమోషన్ వీడియోలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ మూవీ ‘డియర్ కామ్రేడ్’ చిత్రంను ఢీ కొట్టబోతుంది. తమిళనాట ఈ రెండు చిత్రాల మద్య రసవత్తర పోరు సాగుతుందేమో చూడాలి.
Please Read Disclaimer