ఫైనల్ గా ప్రియాంక ఖాతాలో ఓ సినిమా!

0

‘టాక్సీవాలా’ తర్వాత ప్రియాంక జవాల్కర్ నటించే సినిమాపై ఇంతవరకూ సమాచారం లేరు. మధ్యలో ఒక సినిమాలో నటిస్తోందని టాక్ వినిపించింది కానీ క్లారిటీ లేదు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. నూతన దర్శకురాలు సుజన తెరకెక్కించే చిత్రంలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ‘పెళ్ళిచూపులు’ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి తనయుడు శివ ప్రియాంకకు జోడీగా నటిస్తున్నాడు. శివ కందుకూరికి హీరోగా ఇది మూడవ చిత్రం కావడం విశేషం. శివ ‘చూసి చూడంగానే’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. మరో సినిమా ‘మను చరిత్ర’ కూడా లైన్ లో ఉంది. ఈ రెండు కాకుండా ప్రియాంకతో నటించే సినిమా మూడవది.

ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శ్రియ మరో కీలక పాత్రలో నటిస్తోంది. నిజానికి ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ పోషిస్తున్న పాత్ర కోసం నిహారిక కొణిదెలను తీసుకుందామని అనుకున్నారట. ఈపాత్ర కోసం తనతో సంప్రదించడం కూడా జరిగిందట. మరి ఎందుకో కానీ ప్రియాంక జవాల్కర్ ను ఫైనలైజ్ చేసుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోందట. ఈ చిత్రంతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ నిర్మాతగా మారుతున్నారు. మరో నిర్మాత రమేష్ కరుటూరితో కలిసి ఈ చిత్రాన్ని జ్ఞానశేఖర్ నిర్మిస్తున్నారు.

‘టాక్సీ వాలా’ సూపర్ హిట్ అయినప్పటికీ ప్రియాంక జవాల్కర్ కు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. సోషల్ మీడియాలో ఫోటోషూట్లతో హంగామా చేస్తున్నా పెద్దగా టాలీవుడ్ మేకర్ల నుండి అనుకున్నంత స్పందన రాలేదు. తన వెయిటింగ్ పీరియడ్ పూర్తయ్యి ఫైనల్ గా ఈ సినిమాతో మళ్ళీ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రియాంక ఒక ముస్లిం అమ్మాయి పాత్రలో నటిస్తోందని.. పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉండే పాత్ర అని సమాచారం. ఈ సినిమాతో అయినా మళ్ళీ ఫామ్ లోకి వస్తుందేమో వేచి చూడాలి.
Please Read Disclaimer