ఎట్టకేలకు డేట్ ప్రకటించారు థాంక్స్ – వెంకటేష్

0

కొంత మంది హీరోలు స్టేజి మీద భారీ స్పీచ్ లకు అందులో వెంకీ ముందు వరుసలో ఉంటాడు.
ముప్పై ఏళ్లయినా ఇప్పటికీ స్టేజి మీద ఫియర్ కామన్ అంటాడు వెంకీ. తాజాగా వెంకీ మామ ప్రెస్ మీట్ లో కూడా అదే చెప్పాడు.

ముఫై ఏళ్ల నుండి మీరు ఇదే వింటున్నారు. స్టేజికి మీదకి వస్తే మాట్లాడలేను. నిన్న మొన్న వచ్చిన కుర్రాళ్లు కూడా నేర్చేసుకుంటున్నారు. ఎందుకో నాకు మాత్రం అదే ప్రాబ్లమ్ అంటూ తన స్పీచ్ గురించి చెప్పాడు. ఇదే వేదికపై స్పీచ్ కి ముందు పల్లెటూరి యాసలో మాట్లాడి నవ్వించాడు వెంకీ. ఎప్పుడూ లేని టెన్షన్ ఈ సినిమాకి ఉందన్నాడు.

ముఖ్యంగా ఎప్పటి నుండో వెంకీ మామ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నా అని చెప్తూ అన్నయ్య సురేష్ బాబు కి అలాగే సురేష్ ప్రొడక్షన్స్ కి ఫైనల్ గా డేట్ అనౌన్స్ చేసినందుకు థాంక్స్ అంటూ సరదాగా మాట్లాడాడు. ఇక చైతూ రానా లతో సినిమా అంటే ఎప్పుడు ఎగ్జైట్ అవుతానని అన్నాడు.
Please Read Disclaimer