హీరోయిన్ కు ఫైన్ పడింది

0

న్యాయం.. చట్టం విషయంలో అంతా సమానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రముఖులు అయినా స్టార్స్ అయినా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో పలు సార్లు స్టార్స్ ట్రాఫిక్ చెలాన్లను చెల్లించిన సందర్బాలు ఉన్నాయి. ఇప్పుడు తాప్సికి ట్రాఫిక్ చలానా పడింది. ఈ అమ్మడు తాజాగా ఒక బుల్లెట్ పై రోడ్డు మీద చక్కర్లు కొట్టింది. రోడ్డు మీద హెల్మెట్ లేకుండా బైక్ ప్రయాణం చేసినందుకు గాను ఈ అమ్మడికి ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. ఆ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

హెల్మెట్ లేకుండా బండి నడిపినందుకు గాను ఫైన్ విధించారు. ఫైన్ పడటానికి కొద్ది సమయం ముందు ఈ ఫొటో అంటూ తాప్సి ఈ ఫొటోను షేర్ చేసింది. ఫైన్ పడ్డ విషయాన్ని గొప్పగా చెప్పుకోవడం ఏంటీ అంటూ కొందరు నెటిజన్స్ ఈమె తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ విషయంలో ఒక సెలబ్రెటీగా సామాజిక బాధ్యతతో ప్రచారం చేయాలి కాని ఇలా తను హెల్మెట్ లేకపోవడం వల్ల ఫైన్ చెల్లించాను అంటూ చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అంటూ మరికొందరు ఈమెను ప్రశ్నిస్తున్నారు.