‘రొమాంటిక్’ సెట్ లో ఫైర్ యాక్సిడెంట్

0

పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రం షూటింగ్ సందర్బంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇండోర్ సెట్ లో చిత్రీకరణ జరుపుతున్న సందర్బంగా ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మొదట ఒక క్లాత్ కు మంట అంటకుంది. అక్కడ నుండి ఆ మంట విస్తరించింది. యూనిట్ సభ్యులు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కాని మంటలు చాలా స్పీడ్ గా వ్యాపించాయి.

షూటింగ్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆకాష్ అక్కడ ఉన్నాడా లేదా అనే విషయమై ఇంకా సమాచారం రావాల్సి ఉంది. నిన్న జరిగిన ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూరి స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కేతిక శర్మ నటిస్తోంది.

అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ఫస్ట్ లుక్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరీ బోల్డ్ గా రొమాంటిక్ గా ఉన్న లుక్ తో సినిమాపై జనాల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ రొమాంటిక్ సినిమా కోసం చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో చిత్ర సెట్ లో అగ్ని ప్రమాదం జరగడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఈ అగ్ని ప్రమాదం విషయమై చిత్ర యూనిట్ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.