పరశురామునికే అగ్ని పరీక్షా

0

గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించాడు పరశురామ్. నెవ్వర్ బిఫోర్ అన్నంతగా గొప్ప ఎమోషనల్ లవ్ స్టోరీని తెలుగు సినీపరిశ్రమకు ఇచ్చిన ఘనతను సొంతం చేసుకున్నాడు. పూరి సోదరుడు పరశురామ్ స్థాయి ఏంటో బయటపెట్టిన చిత్రమిది. అతడికి సరైన సపోర్ట్ దక్కితే ఇలాంటి అద్భుతాలు ఎన్ని అయినా చేయగలడు అన్న నమ్మకం పెరిగింది. మార్కెట్ వర్గాలకు అతడంటే గురి పెంచిన చిత్రమిదని చెప్పొచ్చు.

సరిగ్గా ఇలాంటి కీలక మలుపులో అతడి కెరీర్ పరుగులు పెడుతుందనే అనుకున్నారంతా. ఆ వెంటనే అతడు మరో చిత్రాన్ని ప్రారంభించాల్సి ఉండగా ఎందుకనో ఇన్నాళ్ల డైలమా ఆశ్చర్యపరుస్తోంది. పరశురామునికే అగ్ని పరీక్షా? అన్నంతగా ఆ వెయిటింగ్ ఎందుకో అర్థం గాక ఫ్యాన్స్ గందరగోళంలో ఉన్నారు. గీత గోవిందం 70 కోట్ల షేర్.. 100కోట్లు పైగా గ్రాస్ వసూలు చేసింది. అంత పెద్ద హిట్టు తీస్తే ఇన్నాళ్ల వెయిటింగ్ ఎందుకు?

మహేష్ తో అవ్వలేదు.. ప్రభాస్ తో కుదరలేదు.. పవన్ నో చెప్పాడు అంటున్నారు…ఆ మధ్యలో అఖిల్ పేరు వినిపించింది. ఇంతమంది ఎందుకు కాదంటున్నారు? కొత్త స్క్రిప్టుతో మెప్పించలేకపోతున్నాడా? అంత పెద్ద హిట్టు తీసి ఏమిటీ అగ్ని పరీక్ష.. రూమర్స్ మీద రూమర్స్ ఎందుకు వస్తున్నాయి? పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా పింక్ రీమేక్ బాధ్యతలు పరశురామ్ కే అప్పగించే ఛాన్సుందన్నది .. ప్రభాస్-యు.వి బృందం అతడిని సంప్రదించారన్నది రూమర్లేనా? అఖిల్ ఇంతవరకూ స్క్రిప్టు ఓకే చేయలేదా? ఎందుకీ డైలమా పరశురామా? మిరాకిల్స్ చేసే దమ్మున్నా ఏమిటీ సంశయం? కాస్త క్లారిటీ ఇవ్వవూ?




Please Read Disclaimer