సరిలేరు నీకెవ్వరు మూవీ నైజాం ఫస్ట్ డే కలెక్షన్స్

0

మహేష్ సరిలేరు నీకెవ్వరు నిన్న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుండే ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహేష్ యాక్షన్ అండ్ కామెడీ టైమింగ్ మరియు ఎనర్జిటిక్ స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా ఐపోయారు. దర్శకుడు అనిల్ టేకింగ్ కి కూడా మంచి మార్కులే పడ్డాయి. కాగా నైజాంలో మొదటిరోజు సరిలేరు నీకెవ్వరు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం మొదటి రోజు నైజాంలో 8.66 కోట్ల షేర్ రాబట్టింది. మహేష్ కెరీర్ లోనే బెస్ట్ నైజాం ఫస్ట్ డే ఓపెనింగ్ గా నిలిచింది. నైజాంలో ప్రభాస్ సాహో మొదటి స్థానంలో కొనసాగుతుండగా… బాహుబలి 2, సైరా తరువాత స్థానాల్లో ఉన్నాయి.

అతిపెద్ద సినిమా సీజన్ గా భావించే సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు రానున్న రోజులలో మరిన్ని మెరుగైన వసూళ్లు సాధించే అవకాశం కలదు. దర్శకుడు అనిల్ రావిపూడి కంప్లీట్ కమర్షియల్ ఎంటరైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ రోల్ చేయడం జరిగింది. రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి కీలక రోల్ చేశారు. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు.
Please Read Disclaimer