కీరవాణి వారసుడి కోసం ఎంతకైనా

0

మరకతమణి ఎం.ఎం.కీరవాణి వారసుల సినీ ఎంట్రీ ప్రస్తుతం హాట్ టాపిక్. ఒక వారసుడు కథానాయకుడిగా పరిచయం అవుతుంటే.. మరొక వారసుడు సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాంటి ఇంపార్టెంట్ సినిమాకి ప్రచారం ఆశించినంతగా లేదన్న ఆవేదన కీరవాణి అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే అన్న కోసం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బరిలో దిగుతారా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది.

కీరవాణి తనయుడు సింహా కోడూరి ని హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ `మత్తు వదలరా` అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా 2020 ఆరంభంలో రిలీజ్ కానుంది. కీరవాణి మరో కుమారుడు భైరవ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇది కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. ఈ చిత్రానికి డెబ్యూ రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ దాదాపు పూర్తయింది. తొలి నుంచి ఈ ప్రాజెక్టు కు జక్కన్న సూచనలు సలహాలు ఇస్తున్నారని… నిర్మాణానంతర పనుల్లోనూ ఆయన శ్రద్ద పెట్టారని ప్రచారమైంది. ఇదివరకూ స్క్రీనింగ్ అనంతరం రాజమౌళి ఆ సినిమా లో తప్పులను సరి చేయాల్సిందిగా సూచించారన్న సమాచారం ఉంది.

`మత్తు వదలరా` టీమ్ పెండింగ్ పనుల్ని ముగించి రిలీజ్ ప్రచారానికి రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు తాజాగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి రాజమౌళి బూస్ట్ ఇస్తారని భావిస్తున్నారు. అయితే రాజమౌళి ఇటీవట సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ తో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు. అందుకే సోషల్ మీడియాలకు దూరంగా ఉన్నారు. ఇంతకు ముందు సాహో.. సైరా ట్రైలర్ల గురించి ప్రచారం చేసారు. ఆ తర్వాత తన స్నేహితుడు అయిన శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం `భాగ్యనగరం వీధుల్లో గమ్మత్తు` చిత్రానికి ప్రచారం చేశారు. ఈ సినిమా ట్రైలర్ ని జక్కన్న సోషల్ మీడియాల్లో షేర్ చేయడంతో మంచి మైలేజ్ వచ్చింది. ఇక పై మత్తు వదలరా చిత్రానికి ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. అన్న కొడుకుని హీరోగా ప్రమోట్ చేసేందుకు రాజమౌళి ఇంకా ఏం చేయబోతున్నారు? అన్నది చూడాలి.
Please Read Disclaimer