లాల్ సింగ్ చద్దా ఫస్ట్ లుక్

0

తాను ఏ పాత్రలో చేసినా అందులోకి పరకాయ ప్రవేశం చేయడం బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కి అలవాటు. ఆయన కథల సెలెక్షన్ పైనా పాత్రల ఎంపికపైనా జనాలతో పాటు మార్కెట్ వర్గాల్లోనూ ఎంతో ఆసక్తికర చర్చ సాగుతుంటుంది. ప్రస్తుతం అతడు ఒకేసారి మూడు నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్ సహా మొఘల్ పేరుతో టీసిరీస్ గుల్షన్ కుమార్ బయోపిక్ లో నటించనున్నాడు. ఈలోగానే అతడు వేరొక ఆసక్తికర సినిమాలో నటిస్తున్నాడు.

‘లాల్ సింగ్ చద్దా’ అనే శిక్కు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి లీక్డ్ ఫోటో ఒకటి ఇటీవలే అంతర్జాలంలోకి లీకైంది. ఈ లీక్డ్ ఫోటోలో అమీర్ గుర్తు పట్టలేనంత కొత్తగా కనిపించాడు. పూర్తిగా గుబురుగడ్డం తలపాగాతో శిక్కు గెటప్ లో కనిపించడంతో అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. ఆ క్యూరియాసిటీని మరింత పెంచేస్తూ నేడు చిత్రబృందం ఫస్ట్ లుక్ ని రివీల్ చేసింది. సింగ్ గారి పాత్రలో అమీర్ లుక్ ప్రస్తుతం అభిమానుల్లోకి జోరుగా వైరల్ అవుతోంది.

మరోసారి ఆ పాత్రలోకి అమీర్ ఒదిగిపోయారు అంటే అతిశయోక్తి కాదు. ఫార్మల్ డ్రెస్ లో ఏదో ఎగ్జయిట్ మెంట్ తో కనిపిస్తున్నాడు లాల్ సింగ్. తన చేతిలో ఓ గిఫ్ట్ ప్యాక్ ఉంది. ఈ లుక్ సింప్లీ సూపర్భ్. అమీర్ నుంచి ఏదో ఒక కొత్తదనం ఆశించే అభిమానులకు ఇది నిజంగానే సర్ ప్రైజ్ ట్రీట్ అనే చెప్పాలి. ప్రస్తుతం శిక్కులు ఎక్కువగా ఉండే ఛండీఘర్ లో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది.

పోస్టర్ చూశాక నెటిజనుల్లో సర్ధార్ జీ లుక్ లో అమీర్ పర్ఫెక్షన్ కి పొగడ్తలే పొగడ్తలు దక్కుతున్నాయి. అద్వైత్ చందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కరీనా కపూర్ ఖాన్ కథానాయికగా నటిస్తోంది. 2020 డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
Please Read Disclaimer