31 డిసెంబర్ మిడ్ నైట్ టాలీవుడ్ ట్రీట్

0

డిసెంబర్ 31.. టాలీవుడ్లో భారీ పండగ వాతావరణాన్ని తీసుకురాబోతోందా? అంటే అవునే చెబుతున్నాయి టాలీవుడ్ వర్గాలు.. డిసెంబర్ 31 మిడ్నైట్ టాలీవుడ్ నుంచి భారీ ట్రీట్లు.. మెరుపులు… మెస్మరైజింగ్ అనౌన్స్ మెంట్లు రాబోతున్నాయి. ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్న భారీ చిత్రాల దర్శకనిర్మాతలు హీరోలు అభిమానులకు ప్రేక్షకులకు బిగ్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ ట్రీట్‌కు సరిగ్గా 42 రోజుల సమయం వుంది. డిసెంబర్ 31న టాలీవుడ్ నుంచి కళ్లు చెదిరే న్యూస్‌లు ట్రైలర్లు ఫస్ట్‌లుక్‌లు టీజర్లు ట్రైలర్లు రాబోతున్నాయి.

ఇందులో ప్రధానంగా రామ్‌చరణ్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` నుంచి కొత్త లుక్‌లు రాబోతున్నాయి. ఈ చిత్రం కోసం ఇప్పటి వరకు ఫ్యాన్స్ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్‌ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఎలా వుండబోతోందనే క్యురియాసిటీ అందరిలోనూ మొదలైంది. దీనికి తగ్గట్టే `ఆర్ ఆర్ ఆర్` లుక్‌లు వుండబోతున్నాయని తెలుస్తోంది. దీనికితోడు మహేష్‌బాబు నటిస్తున్న `సరిలేరు నీకెవ్వరు` నుంచి కూడా డిసెంబర్ 31 నైట్ మెరుపులాంటి ట్రైలర్ రాబోతోంది.

ఇప్పటికే టీజర్‌తో హింట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ట్రైలర్ కోసం భారీగానే కసరత్తులు చేస్తున్నారట. ఈ రేసులో అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో..` నుంచి కూడా ఓ మెస్మరైజింగ్ న్యూస్ రాబోతోంది. ఇందులో టాబు కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక రజనీకాంత్ `దర్బార్` నుంచి కూడా మెరుపులు రాబోతున్నాయి. ట్రైలర్ ని రిలీజ్ చేసే అవకాశం వుందని తెలిసింది. నందమూరి హీరో కల్యాణ్‌రామ్ నటిస్తున్న సాఫ్ట్ మూవీ `ఎంత మంచి వాడవురా` నుంచి కీలక ప్రోమోలు రాబోతున్నాయి. దీనితో పాటు పలు కొత్త చిత్రాలకు సంబంధించిన ప్రకటనలు విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్‌ల సినిమా లుక్ కూడా రాబోతోందని తాజా సమాచారం. ఇలా పలు చిత్రాల లుక్లతో డిసెంబర్ 31 రాత్రి టాలీవుడ్ సెలబ్రిటీస్ హంగామా చేయబోతున్నారు.
Please Read Disclaimer