ఫస్ట్ లుక్: జైల్లో ‘జాతి రత్నాలు’

0

420.. 210.. 840 .. ఈ నంబర్స్ చూసి కంగారు పడొద్దు. ఇవన్నీ జైలు పక్షుల నంబర్లు. ఈ ఖైదీ పక్షులు బోలెడంత వినోదాన్ని పంచబోతున్నాయని తాజాగా రివీలైన ‘జాతి రత్నాలు’ టీజర్ చెబుతోంది. జాతీయ అవార్డ్ మూవీ ‘మహానటి’ కి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. నవీన్ పొలిశెట్టి- ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ ఇందులో ప్రధాన పాత్రధారులు. అనుదీప్ కె.వి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ఫస్ట్లుక్.. మోషన్ పోస్టర్ రిలీజైంది. 420-210- 840 నంబర్లు ఉన్న జైలు దుస్తులు ధరించి ఆ ముగ్గురు నవ్వులు చిందిస్తున్న మోషన్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించింది. వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్న ఈ చిత్రం ఫన్నీయెస్ట్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ అంటూ కొటేషన్ ని మోషన్ పోస్టర్ పై చూపించారు. నవీన్ పొలిశెట్టి- ప్రియదర్శి.. రాహుల్ రామకృష్ణ ఈ చిత్రంలో పూర్తి స్థాయి కామెడీ పండించే పాత్రలో నటించనున్నారని అర్థమవుతోంది. ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ ఇదని భావించవచ్చు.

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో హీరోగా బ్లాక్బస్టర్ కొట్టిన నవీన్ పొలిశెట్టి ఇటీవలే చిచ్చోర్ అనే చిత్రంలోనూ నటించాడు. మరోసారి తెలుగు సినిమాతో లక్ చెక్ చేసుకుంటున్నాడు. ఇక ప్రియదర్శి- రాహుల్ రామకృష్ణ కాంబినేషన్ ‘బ్రోచెవారెవురురా’ చిత్రంలో తమదైన కామెడీతో మెప్పించారు. ఆ ముగ్గురి కలయికలో నాగ్ అశ్విన్ చేస్తున్న ప్రయత్నం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది కూడా కాన్సెప్ట్ బేస్డ్ సినిమా. ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రధన్ సంగీతం.. సిద్ధాన్ మనోహర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా- మురళీశర్మ- వి.కె.నరేశ్- బ్రహ్మాజీ- తనికెళ్ల భరణి- శుభలేఖ సుధాకర్- వెన్నెల కిషోర్ -గిరిబాబు తదితరులు నటిస్తున్నారు.